ఇటీవలి కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు పెట్రోల్ ధరలు తగ్గుతాయి ఏమో అని సామాన్య ప్రజలందరూ కూడా నిరీక్షణ గా ఎదురు చూడటం తప్ప అటు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. మొన్నటి వరకు ఎలక్షన్ల కారణంగా పెట్రోల్ ధరలు కాస్త స్తిరంగా నే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముగిసిపోవడంతో మళ్ళీ ధరలు అంతకంతకూ పెరిగి పోతూనే ఉన్నాయి.  రోజు పెట్రోల్ ధర పెరిగిపోతుండడంతో సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఏర్పడింది.


ఇక పెట్రోల్ ధరలు తగ్గుతాయని ఆశలు పెట్టుకోవడం కంటే ఇక మనమే తగ్గి సైకిల్ కొనుక్కోవడం లేకపోతే ఎలక్ట్రికల్ బైక్ కొనుక్కోవటం బెటర్ అని భావిస్తున్నారు. ఎంతోమంది ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ బైక్ లలో కూడా మంటలు చెలరేగుతూ కాలి పోతూ ఉండడంతో అవి కొనుక్కోవడానికి కూడా భయపడి పోతున్నారు. పెట్రోల్ ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం సూపర్ ప్లాన్ వేసాడు. ఎంతో దర్జాగా  కార్ లో డిజిల్  కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ కి వచ్చాడు. ఫుల్ ట్యాంక్ చేయమని కార్ లో నుంచి చెప్పాడు.


 ఇక ఇలా పెట్రోల్ బంకు లో ఉన్న సిబ్బంది ఆ కార్ లో ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత డబ్బులు తీసు కోవడానికి వెళ్తుండగా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళి పోయాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పెట్రోల్ బంక్ లో పని చేసే యువకుడు ఆ పక్కనే ఉన్న ఒక రాయి తో కార్ అద్దాన్ని పగలగొట్టాడు. అంతేకాదు ఇక సిసిటివి కెమెరా లో చూసి ఆ కారు నెంబర్ ఏంటి అని గ్రహించి విచారణ జరిపేందుకు కూడా బంక్ యాజమాన్యం సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: