మనం మాములుగా మన దంతాలను వేటితో శుభ్రం చేసుకుంటాం. బ్రష్ లేదా వేప పుల్లతో లేదా పలు రకాల మౌత్ వాష్ లతో లేక ఉప్పుతోనో శుభ్రం చేసుకుంటాము. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా రొయ్యతో క్లీన్ చేసుకుంటున్నాడు. అందులో ఆశ్చర్యం ఏమిటనుకుంటున్నారో అతను క్లీన్ చేసుకోవడం లేదు. ఆ రొయ్యే అతని దంతాలు క్లీన్ చేస్తుంది. అర్ధం కావట్లేదా అయితే ఈ స్టోరీ చదవండి. మీకే అర్ధం అవుతుంది.ఇక సముద్ర గర్భం ఎన్నో రకాల జీవులకు నివాసం. జీవ వైవిధ్యానికి ఆయువుపట్టు అనే చెప్పాలి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవి కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తాజాగా మనిషి దంతాలను రొయ్య శుభ్రం చేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో(Social Media) తెగ వైరల్ గా మారింది.ఇక ఈ వైరల్(Viral) వీడియోలో ఓ రకమైన రొయ్య.. మనిషి పళ్లను బాగా శుభ్రపరుస్తుంది. 'అమేజింగ్ నేచర్' ఖాతా ద్వారా ట్విట్టర్‌లో ఈ వీడియో షేర్ అయింది. స్కూబా డైవింగ్(Scubadiving) చేస్తున్న ఓ వ్యక్తి అక్కడ సముద్రంలో పగడపు దిబ్బల దగ్గర నోరు తెరుస్తాడు. అతని దగ్గరికి ఒక రొయ్య వచ్చి, తన పాదాలతో దంతాలు ఇంకా అలాగే చిగుళ్ల నుంచి ఆహారాన్ని ఇంకా అలాగే మృతకణాలను తినేసి బాగా శుభ్రం చేస్తుంది.



ఈ వీడియో చూసి నెటిజన్లను తెగ ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు సదరు స్కూబా డైవింగ్ చేసిన ఆ వ్యక్తి.. 'పళ్ళు శుభ్రం కావాలంటే నన్ను సంప్రదించండి' అని తాను పోస్ట్‌ చోసిన వీడియోకు ఆ క్యాప్షన్ ఇచ్చాడు. నిజానికి సముద్రంలోకి ప్రవేశించి, రొయ్యల ద్వారా దంతాలను శుభ్రం చేసుకోగలిగితే.. ఇకపై ఎవరికి కూడా టూత్ బ్రష్, డెంటిస్ట్ ల అవసరం లేదని నెటిజన్లు ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.ఇక దంతాలను శుభ్రం చేస్తున్న క్లీనర్ రొయ్యలు.. మహాసముద్రాల అంతటా కూడా పగడపు దిబ్బలపై నివసిస్తాయి, ఇవి  పసిఫిక్ మహాసముద్రంలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. డెడ్ స్కిన్ ఇంకా అలాగే పరాన్నజీవులు అని పిలువబడే చిన్న హానికరమైన జంతువులను వారి శరీరాల నుంచి తొలగించడం ద్వారా రీఫ్‌లోని చేపలు శుభ్రంగా ఉండటానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: