కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ పిక్స్ లెవెల్ కి వెళ్ళింది అంటే చాలు ఎలాంటి పని చేయడానికైనా సరే మనుషులు వెనక్కు తగ్గరు.  అయితే నిజజీవితంలో ఏమో కానీ సినిమాల్లో అయితే ప్రస్టేషన్ ఎక్కువైపోయింది అంటే ఎంతో విలువైన వస్తువులను పగలగొట్టడం లాంటివి చూస్తూ ఉంటము. ఇక్కడ అచ్చంగా ఇలాంటిదే సినిమాలకు మంచిన ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. తమిళనాడులోని అంబత్తూరు కు చెందిన ఫిజియోథెరపీ పృథ్వి రాజ్ ఫ్రస్టేషన్  పిక్స్ వెళ్లడంతో తన బైక్ మొత్తాన్నీ చేతులతో తగల పెట్టుకున్నాడు.



 పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో  ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలు చేశాడు.  ఏప్రిల్ 26వ తేదీన మధ్యాహ్నం సమయంలో అంబుర్ సమీపంలో రోడ్డు మధ్యలో తన ఎలక్ట్రికల్ స్కూటర్ ఆగిపోయింది.  చార్జింగ్ అయిపోయింది. అయితే ఇది మొదటిసారి కాదు ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు సాంకేతిక సమస్యలతో మార్గమధ్యంలో బైక్ ఆగిపోయి ఇబ్బందులు పడ్డాడు సదరు వ్యక్తి  కంపెనీ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇటీవలే మరోసారి ఇలాగే మార్గమధ్యంలో బైక్ ఆగిపోవడంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది.



 దీంతో జనవరి నెలలో కొనుగోలు చేసిన సదరు ఎలక్ట్రికల్ బైక్ ని పెట్రోల్ బాటిల్ లోని పెట్రోల్ మొత్తం పోసి నిప్పంటించాడు.  అందరూ చూస్తుండగానే బైక్ నిమిషాల వ్యవధిలో కాలి బూడిద అయింది. ఛార్జింగ్ చేస్తే 181 కిలోమీటర్ల ప్రయాణిస్తుందని కంపెనీవారు చెబుతుంటే..  ఇక తాను కొనుగోలు చేసిన ఎలక్ట్రికల్ వెహికల్ మాత్రం 50 నుంచి 60 కిలోమీటర్ల మాత్రమే వస్తుందని ప్రజలు ఆరోపించారు. ఇక రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లిద్దామని ఆర్డిఓ ఆఫీస్ కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో 60 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత రోడ్డు మధ్యలో బ్యాటరీ అయిపోయింది. కంపెనీ వారికి ఫోన్ చేస్తే పికప్ చేసేవాళ్ళు అందుబాటులో లేరని చెప్పారు. ప్రస్టేషన్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. దీంతో బైక్ తగలబెట్టాడు. అయితే ఇదే విషయం కంపెనీ ప్రతినిధి ఫోన్ చేస్తే మీడియాకు ఈ విషయం చెప్పవద్దని కొత్త బైక్ తో సమస్యను భర్తీ చేస్తామంటూ మాటిచ్చారు అంటూ సదరువాహన యజమాని పృద్విరాజ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: