పిజ్జాను తినడం అంటే అందరికి ఇష్టం..ఆ ఫ్లెవర్స్ అలా ఉంటాయి.. ఎలాంటి వారినైన కూడా తినాలని అనిపించేలా చెస్తుంది..ఇది మన ఫుడ్ కాదు.అయిన కూడా చాలా మంది తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..ఓ వ్యక్తి పిజ్జా తినడానికి చాలా ఆసక్తి  చూపించాడు.తన ఆకలిని రెట్టింపు చేసుకోని పిజ్జాను తినాలని అనుకున్నాడు. అయితే అతను నచ్చిన పిజ్జాను ఆర్డర్ పెట్టుకున్నాడు. తిందామని ఆశగా ఓపెన్ చేసి రెండు ముక్కలు తిన్నాడు.. అంతే ఏమైందో తెలియదు కానీ మూడో ముక్కకు అతను తింటూ కుప్ప కూలాడు. తీరాచూస్తె అతను చనిపోయాడు.


ఈ ఘటన ఇంగ్లండ్‌లోని న్యూక్యాసిల్లో వెలుగు చూసింది.జేమ్స్ అట్కిన్సన్ అనే యువకుడు న్యూక్యాసిల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్లో నివాసం ఉండేవాడు. 2020 జులై 10న డడ్యాల్ అనే రెస్టారెంట్ నుంచి డెలివరూ యాప్ ద్వారా చికెన్ టిక్కా మసాలా పిజ్జాను ఆర్డర్ చేశాడు..పిజ్జా కోసం చాలా ఆశగా వెళ్ళాడు. డెలివరీ బాయ్ కు టిప్ కూడా ఇచ్చి మరి ఆర్డర్ ను తీసుకున్నాడు..



రెండు ముక్కలు పూర్తి కాగానే అతడి పెదవులు, గొంతు వాచిపోయాయి. నొప్పితో బాధపడుతూ వెంటనే సహాయం కోసం ఎమర్జెన్సీ నంబర్ 999కి కాల్ చేశాడు. కొన్ని నిమిషాల్లోనే వైద్య సిబ్బంది జేమ్స్ ఇంటికి చేరుకున్నారు.జేమ్స్ ను పరిశీలించిన వైద్యులు అతడు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడని.. మరణించినట్లు ధృవీకరించారు. దీనికి కారణం ఏమిటా అని పరిశీలిస్తే.. చిన్నప్పటి నుంచి అతడికి పీనట్ అలర్జీ ఉన్నట్లు తేలింది. జేమ్స్ ఆర్డర్ చేసిన పిజ్లాలో సదరు రెస్టారెంట్ వేరుశెనగ పొడిని వినియోగించినట్లు తేలింది.పిజ్జా తయారీలో అసలు ఏఏ ముడిపదార్ధాలను వినియోగిస్తారో తెలపకపోవటం వల్లనే తన కుమారుడు మృతికి కారణని అతని తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డడ్యాల్ రెస్టారెంట్ ఇప్పటికే మూతపడింది..ఈ ఘటన పై విచారణ ఇంకా కొనసాగుతుంది.. అతడి కోరికే అతడిని మింగెసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: