భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం హోటల్ నిర్వాహుకులు భారీ ప్లానులు వేస్తున్నారు.రుచి తో పాటుగా కొత్త కొత్త ప్లానులు వేస్తున్నారు.. ఎవరూ తినని, చూడని విధంగా వంటను రెడీ చేస్తున్నారు కొందరు. మరి కొందరు కస్టమర్లకు మరింత ఆకర్షణ కలిగించేందుకు అందంగా ముస్తాబు చేస్తున్నారు. మరి కొంత మంది చూపరుల దృష్టిని తమ వైపు మల్లెలా చేసుకుంటున్నారు.. ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యాయి..వాటిని తినడానికి జనాలు కూడా ఎగబడుతున్నారు.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొందరు వ్యాపారులు విభిన్న రకాలుగా విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు తాము చేసే వంటకాలలో నాణ్యత పాటించడంతో పాటూ పని చేయడంలోనూ ప్రత్యేకతను కనబరుస్తుంటారు.


ఈ మధ్య ఫుడ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే...ఫ్లయింగ్ దోస, రజిని స్టైల్ దోస ఇలా ఒకటేమిటి ఎన్నో వస్తున్నాయి.. అవి ఎలా చేస్తారు అనే ఆలోచన జనాలను తొలచివేస్తుంది. దాంతో వాళ్ళు చేసే స్టయిల్ ను చూసి చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మరో వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది. అదే ఫ్లయింగ్ దహి వడ..మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని బడా సరాఫా అనే ప్రాంతంలో జోషి జి అనే వ్యక్తి.. పెరుగు వడను వినూత్నంగా అందిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ముందుగా ప్లేటులో వడ తీసుకుని, అందులో పెరుగు కలుపుతాడు.

 

తర్వాత ప్లేట్‌ను గాలిలోకి ఎగరేస్తాడు. దీంతో పెరుగు ఎక్కడ కిందపడిపోతుందో అని అంతా అనుకుంటారు. కానీ విచిత్రంగా కొంచెం కూడా కిందపడకుండా దాన్ని పట్టు కుంటాడు..అలా దాని మీద కొన్ని రకాల మసాలాలను చల్లుతారు.మళ్లీ ఓ సారి గాలిలోకి ఎగరేస్తాడు. చివరగా అంతే స్టైల్‌గా పెరుగువడను కస్టమర్లకు అందిస్తాడు. 1977 నుంచి వంశపారంపర్యంగా తాము పెరుగు వడను అందిస్తున్నామని జోషి ఈ దహి వడకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: