ఇక టాలెంట్  అనేది ఎవరి సొంతం కాదు.నిజంగానే టాలెంట్ ఉన్నవారు ఎవరి ముందు తల వంచాల్సిన పనిలేదు. కష్టపడి తానేంటో అందరి ముందు నిరూపించుకుంటే చాలు..అవకాశాలు వాటంతట అవే వస్తాయని గతంలో ఎంతో మంది నిరూపించారు.ఇంకా నిరూపిస్తూనే వున్నారు. ఇక డ్యాన్స్ చేయడం అంత సులువేం కాదు. రెండు కాళ్లు ఉన్న వారు కూడా డ్యాన్స్ చేయడానికి తెగ ఇబ్బందులు పడుతుంటారు. డాన్స్ వచ్చిన వారు అయితే ఎంతో సులువుగా స్టైల్ గా చేసేస్తారు. డాన్స్ అంటే ఎంతో ఇష్టం తో ప్రొఫషనల్ గా నేర్చుకొని చేసే వారు కూడా చాలా మంది ఉంటారు. కానీ అంగవైకల్యం అనేది కేవలం మనిషికే కాని మనసుకేం లేదంటూ వీక్షలను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసింది ఆమె డాన్స్. తాను.. దివ్యాంగురాలైనా కానీ అసలు ఏమాత్రం కూడా నిరుత్సాహపడలేదు. నేను కూడా అందరిలాగానే మంచి మాస్ స్టెప్పులు వేయగలనని ఆమె నిరూపించింది.ఆ యువతిని చూసి ఎందరో రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు. ఇప్పటి దాకా పెళ్లిళ్ల డ్యాన్స్ వీడియోలు, బరాత్ లో డ్యాన్స్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.



ఇప్పుడు కొత్తగా ఒక దివ్యాంగురాలు తన మాస్ స్టెప్పులతో ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో అదరగొడుతుంది. మోడరన్ దుస్తులు వేసుకుని ఆమె వేసే స్టెప్పులు అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. డీజే పాటకు తగ్గట్టుగా ఆమె ఒంటికాలిపై ఎగురుతూ.. మ్యూజిక్ కు సూట్ అయ్యేలా తన ఫెస్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తు ఎంతగానో అదరగొడుతుంది. ఆ యువతి ఒంటికాలుమీద ఎగురుకుంటూ బాగా డ్యాన్స్ చేస్తోంది. ముఖ్యంగా డాన్స్ వీడియోలకు సంబంధించినవి ఇప్పటికే యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ రావడం మనం చూస్తున్నాం. ఈ పాటలు ఇప్పటికి అదే క్రేజ్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తు వున్నాయి.ఈమె వీడియోకు నెటిజన్లు తమదైన శ్రేణిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంస్టాగ్రామ్ లో ఈమె వీడియోలు చూసి ప్రోత్సాహించండి.ఇక ఈమె పేరు Subhreet Ghumman. ఈమె ఇంస్టాగ్రామ్ యూజర్ నేమ్ వచ్చేసి subhreet.ghumman అని ఉంటుంది. కాబట్టి ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఈమె వీడియోస్ చూసి ఎంకరేజ్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: