సాధారణంగా మనం ఇంట్లో వాడుకునే బకెట్ ఎంత ఉంటుంది. మహా అయితే వందల్లో ఉంటుంది. ఇక అంతకంటే ఎక్కువ మాత్రం ఆ బకెట్ ఉండదు.అయితే ఒక బకెట్ మాత్రం అమెజాన్ లో అయితే రూ.25,999 దాకా బంపర్ ధర పలుకుతోంది. దీన్ని చూసిన ఎంతోమంది కూడా చాలా అవాక్కవుతున్నారు. బాత్ రూమ్ లలో ఇంకా అలాగే ఇంటి అవసరాలకు వాడే ప్లాస్టిక్ బకెట్ కు ఇంత ధరను ఎలా నిర్ణయిస్తారు ? అంటూ అనేక రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక నిజానికి దీని ధర రూ.35,900. 28 శాతం రాయితీపోనూ రూ.25,999 కే ప్రస్తుతం లభిస్తోంది. స్టాక్ కూడా అయిపోయింది. కేవలం ఒకే ఒక బకెట్ మిగిలింది.. అని అంటూ అమెజాన్ లో ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. అసలు ఆ ధరేంటి ? పైగా ఆ ధర పై ఈ డిస్కౌంట్ ఏంటి ? ఆ బకెట్ల స్టాక్ అయిపోవడమేంటి ? అని నెటిజన్లు చాలా నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బకెట్ కు సంబంధించిన ధమాకా ధర పై సోషల్ మీడియాలో వాడివేడి చర్చ అనేది నడుస్తోంది.ఈ ప్లాస్టిక్ బకెట్ కూడా లగ్జరీ ఐటమ్ గా మారిపోయిందా అని పలువురు కామెంట్లు చేశారు.



 బహుశా.. పొరపాటున ఇంత భారీ ధరను టైప్ చేసి ఉంటారని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు. 'దీన్ని కొనేందుకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇవ్వడం చాలా గొప్ప అదృష్టం' అని ఓ నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించడం జరిగింది. అమెజాన్ లో అమ్ముతున్న ఆ ప్లాస్టిక్ బకెట్ స్క్రీన్ షాట్ తో మరెంతో మంది పోస్ట్ లు కూడా చేశారు. ' ప్రతి ఒక్కరి బకెట్ లిస్ట్ లో ఈ బకెట్ ఉండాల్సిందే' అని ఒక నెటిజన్ ఫన్నీగా పేర్కొన్నాడు. 'ఈ బకెట్ తో పాటు బాత్ రూమ్ ను కూడా కాంప్లిమెంటరీగా ఇస్తారేమో' అని మరో వ్యక్తి కూడా చాలా ఫన్నీ కామెంట్ చేశాడు. అలాగే ' ఆ బకెట్ ను తిప్పి చూడండి. మరో వైపు యాపిల్ లోగో ఉంటుంది' అని ఇంకొక నెటిజెన్ అన్నారు. 'ఈ బకెట్ నీళ్లను లిక్కర్ గా మారుస్తుందేమో' అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. 'ఈ బకెట్ ను కొనడానికి కిడ్నీలను అమ్ముకోవాల్సి వస్తుందేమో' అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.ఈవిధంగా ఈ ప్లాస్టిక్ బకెట్ పై అనేక రకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: