ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఆంటే జనాలకు మంచి అభిప్రాయం ఉంది.కొత్త వస్తువులను ప్రజలకు అందించడం తో పాటుగా ఫెస్టివల్ కు గిఫ్ట్ ఆఫర్లు, వస్తువుల పై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు.ఈ మేరకు ఇందులో కొనేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. అయితే కొన్నిసార్లు చిన్న పొరపాట్ల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్క్కొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి.ఇప్పుడు మరోసారి జనాలకు విపరీతమైన కోపాన్ని కలిగించింది.ఒక వస్తువు ధర ఉన్న దాని కన్నా కూడా ఎక్కువ ధరలు వేయడం పై విమర్శలు చెస్తున్నారు...


ఒక బకెట్ ధర కేవలం 25 వేలకు పైగా ఉండటం చూసి జనాలు అందరు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు..అమెజాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఈ విషయం పై పూర్తీ వివరాలు చుద్దాము..సాదారణంగా బకెట్ ధరలు ఎంత వుండొచ్చు.. రెండొందలో, మూడొందలో కాదు మంచి క్వాలిటీ బకెట్ అనుకుంటే ఐదారువందలు నుంచి వెయ్యి వరకూ ఉండొచ్చు.రెండూ కలిపి రెండు, మూడు వందలు ఉండొచ్చనుకుందాం.. కానీ.. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ లో బాత్రూమ్స్ లో వాడుకునే ఒక ప్లాస్టిక్ బకెట్ ధర విస్మయానికి గురిచేసింది. 55 శాతం డిస్కౌంట్ పోనూ ప్లాస్టిక్ బకెట్ రూ.25,999 చూపించడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. అంతేకాదు.. రెండు ప్లాస్టిక్ మగ్గుల ధర కూడా దాదాపు పదివేలు ఉండటంతో 'ఇవెక్కడి బకెట్లు, మగ్గుల్రా మావా' అని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

 

సోషల్ మీడియాలో ఈ బకెట్, ప్లాస్టిక్ మగ్గుల ధరలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను పోస్ట్ చేసి అమెజాన్ ను ట్రోల్ చేస్తున్నారు. సదరు ఈ-కామర్స్ సంస్థ ఈ వ్యవహారం తర్వాత ఆ బకెట్ ధరను తొలగించింది.బకెట్ ధర విషయంలో కాంప్రమైజ్ అయినా మగ్గుల విషయంలో మాత్రం 'మా రేటింతే' అన్నట్టుగా అమెజాన్ వ్యవహరిస్తోందని నెటిజన్లు వెటకారం చేస్తున్నారు. ఈ-కామర్స్ వెబ్ సైట్స్ లో ఈ తరహాలో భారీ ధరలు కనిపించడం కొత్తేమీ కాదు. కొన్ని సందర్భాల్లో టెక్నిషియన్  ప్రాబ్లమ్ అంటూ ఏదొకటి సర్ది చెబుతుంది.ఇప్పుడు అదే మాట చెబుతుందా వేరేది చెబుతోందా అనేది ఆసక్తిగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: