చిన్న ఆలోచన జీవితాన్ని మార్చి వేస్తుంది అనే సంగతి తెలిసిందే.అలా చాలా మంది ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు..కాగా, ఇప్పుడు ఓ వృద్ధ దంపతులు అందరికి ఆదర్శంగా నిలిచారు. ఎందరినొ బాధిస్తున్న జుట్టు సమస్యల నుంచి విముక్తి కలిగించారు.నిజంగా వీళ్ళు చేసిన పనికి ఇప్పుడు పెద్ద బిజినెస్ గా మారింది.వయస్సుతో సంబంధం లేకుండా చిన్న ఆలోచన తో మంచి ఆదాయాన్ని అందుకున్నారు..సొంతంగా చేస్తున్న పని కావడంతో చింతలేని ఆదాయం అయ్యింది.ఆ వృద్ధ దంపతుల సక్సెస్ స్టోరీ గురించి ఒకసారి చూద్దాం..


సూరత్‌కు చెందిన రాధాకృష్ణ, శకుంతలా చౌదరి దంపతులు. దాదాపు యాభైఏళ్లపాటు కుటుంబ వ్యాపారాలు చూసుకుని 2010లో రిటైర్‌ అయ్యారు ఈ ఇద్దరు. ఈ వయసులో వీరికి ఏమాత్రం ఓపిక తగ్గలేదు.అనేక పరిశోధనల తరువాత ఈ వృద్ధ జంట యాభై రకాల మూలికలు, కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆలివ్, ఆముదంలను ఉపయోగించి కోల్డ్‌ ప్రెస్డ్‌ పద్ధతిలో హెయిర్‌ అయిల్‌ను రూపొందించింది. వీటన్నింటిని కలిపి ఆయిల్‌ తయారు చేసిన వీరు..తమ కూతురుకిచ్చి వాడమన్నారు.ఆ ఆయిల్‌ వాడిన దగ్గర నుంచి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం కనిపించింది. దీంతో తాము రూపొందించిన ఆయిల్‌ బాగా పనిచేస్తుందని అర్థమైంది చౌదరి దంపతులకు.

 

ఆ తరువాత బంధువులు, స్నేహితులు కొంతమందికి ఆయిల్‌ ఇచ్చి వాడమన్నారు. వాడిన వారందరికి మంచి ఫలితం కనిపించింది..అలా తమకు తెలిసిన వారికి ఈ ఆయిల్ గురించి చెప్పారు.అందరు వాడటం వల్ల మంచి ఫలితాలు కనిపించడం తో కొద్ది కొద్దిగా బిజినెస్ ను పెంచారు.ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో అవిమీ హెర్బల్‌ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. అవిమీ ద్వారా ఎంతో నాణ్యమైన నూనెను విక్రయిస్తూ ఎంతోమంది జుట్టు సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు ఈ దంపతులు. ఇదేగాక ఆర్థో ఆయిల్, స్ప్రేలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.భవిష్యత్‌లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మలివయసులోనూ ఇంత బాగా ఆలోచించి సమస్యకు చక్కని పరిష్కారం చూపి ఎంతోమంది యువతరానికి ప్రేరణ ఇవ్వడమేగాక యువత కు ఆదర్శంగా నిలిచారు..


మరింత సమాచారం తెలుసుకోండి: