సాధారణంగా కోతుల చేష్టలు ఎప్పుడూ అందరికీ నవ్వు తెప్పించే విధంగా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు కోతి చేష్టలు కొంతమందికి చిరాకు కూడా తెప్పిస్తూ ఉంటాయ్. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది ఎక్కడైనా కోతులు కనిపించాయి అంటే వాటికి దగ్గరగా వెళ్లి మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏదైనా ఆహారాన్ని తమ చేతులతో కోతులకు అందించి తెగ సంతోష పడిపోతుంటారు. అయితే ఇలా కోతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సార్లు మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి అన్న విషయం తెలిసిందే.


 కోతుల దగ్గరగా వెళ్లి ఆహారం అందించాలి అనుకుంటే ఏకంగా మనుషులను గాయపరచడం లాంటివి చేస్తూ ఉంటాయి. కొన్ని రకాల కోతులు మరికొన్ని చిలిపి పనులు చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటాయ్. ఇక్కడ ఓ కోతి చిలిపి పని చేసిన ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అందరూ నవ్వుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే ఓ యువతి కోతుల దగ్గరికి వెళ్ళింది.


 ఈ క్రమంలోనే ఆ కోతులతో మాట్లాడుతూ సైగలు చేస్తూ సెల్ఫీ వీడియో రికార్డింగ్ చేయడం మొదలు పెట్టింది ఆ యువతి. వెనకాల ఉన్న కోతులు ఆమె దగ్గరికి వచ్చాయి. ఇక యువతి మెడలో ఉన్న ఒక లాకెట్ తీసుకోవడానికి ప్రయత్నించింది ఓ కోతి. ఇక ఆ తర్వాత ఇంకోటి ఆమె దగ్గరికి వచ్చింది. ఇక ఫోన్ లో తన ప్రతిబింబాన్ని వింతగా చూసింది కోతి. అయితే అక్కడికి వచ్చిన కోతి కాస్త రొమాంటిక్ కాబోలు.. వస్తూనే యువతికి షాక్ ఇచ్చింది. యువతి దగ్గరికి వెళ్లి డ్రెస్ పైకెత్తి చూసింది. అక్కడ ఏమైనా దాచిపెట్టిందేమో  అని గమనించింది. ఇక యువతి వెంటనే డ్రెస్ సర్దుకుంది. అటు కోతి మాత్రం నేనెం చేశాను అంటూ అమాయకంగా యువతి వంక చూడటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: