సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కేవలం క్షణాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నాం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఘటనలు ప్రతి ఒక్కరిని   ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియో మాత్రం అందరినీ అబ్బుర పరుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చైనాకు చెందిన ఓ ప్రయాణికులతో కూడిన విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. విమానం మేఘాల్లో వెళ్తున్న సమయంలో ఒక క్షిపణి  మధ్యలో దూసుకుపోయింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విమానంను హెచ్చరించి దానిని దారి మళ్లించారు.


 దీంతో కొద్ది లో ప్రమాదం తప్పింది అని చెప్పాలి.  సమయానికి అప్రమత్తం అవ్వకుండా ఉండి ఉంటే చివరికి ఆ మిస్సైల్ విమానాన్ని ధ్వంసం చేసేది. చైనాకు చెందిన బోయింగ్ విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా ప్రయాణిస్తుంది. సరిగ్గా అదే సమయంలో సముద్ర ఉపరితలం నుంచి మిస్సైల్  ప్రయోగం జరిగింది.  ఇక ఈ మిసైల్ రాకను గుర్తించిన  ఏటీసీ విమానం పైలెట్ లను వెంటనే అప్రమత్తం చేయడంతో తక్షణమే విమానాన్ని దిశను మార్చారు  ఇలా చేయడం వల్ల క్షిపణి విమానానికి ధ్వంసం చేయలేదు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.



 అదే ఇలా విమానం మేఘాల్లో ఉన్న సమయంలో అటు చైనా నేవీ టైప్ జీరో నైన్ ఫోర్ న్యూక్లియర్ సబ్ మెరైన్ మిస్సైల్ ప్రయోగించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఏరోజు జరిగింది విమానం మేఘాల్లో ఉన్న సమయంలో అందులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు అన్న విషయాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు అని చెప్పాలి. అమెరికాకు చెందిన ఒక పైలెట్   ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన ప్రతి ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir