రుతు పవనాలు వచ్చినా ఇంకా వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. కానీ ఎండ తీవ్రత మాత్రం చాలా ఎక్కువగానే ఉంది.దీంతో ఎండ వేడిమికి సంబంధించి చాలా రకరకాల విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇదివరకే రోడ్డు మీద అమ్లేట్ ఇంకా అలాగే దోశ వేయడం చూశాం. ఇప్పుడు అయితే మరింత కొత్తగా ఆలోచిస్తున్నారు. అలా దోశ వేసి.. వీడియోని కూడా షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక దోశ  అంటే సౌత్ ఇండియాలో ఫేమస్ అనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇక నార్త్‌లో కూడా తింటారు కానీ తక్కువ. అయితే హర్ష్ గొయంక షేర్ చేసిన ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆయన బిజినెస్ టైకున్ ఇంకా ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్. ఏకంగా ఆయన స్కూటీ మీద దోశ వేశాడు. ఎండతో ఆ దోశ తయారు అయ్యింది. ఇంకా గోధుమ రంగు కలర్ కూడా వచ్చింది. ఇంకేముంది దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు దెబ్బకు వైరల్ అవుతుంది.ఇక ఆ వీడియోను ఇప్పటికే 30 వేల సార్లు చూశారు. చాలా మంది ఈ వీడియోని చూసి ఎన్నో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వెస్పా దోశ డన్ బై ప్రొఫెషనల్స్ అని దానికి క్యాప్షన్ కూడా పెట్టారు. 40 డిగ్రీల వేడిలో దోశ తయారైంది అని వారు చెప్పారు.


ఇక ఆ దోశ గోధుమ రంగులోకి వచ్చింది. దోశకు సంబంధించి చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. శక్తి ఉత్పాదన ఇలా కూడా జరుగుతుందా అని ఒక వినియోగదారుడు కామెంట్ చేశారు. ఇంధనం ఆదా అని కార్బన్ అని మరొకరు అన్నారు. ప్రభుత్వానికి సాయం చేసి ద్రవ్యోల్బణం తగ్గించాలని ఇంకా ధరలు కూడా తగ్గించాలని మరొకరు అన్నారు.నిజానికి ఈ న్యూస్ 3 సంవత్సరాల క్రితమే వైరల్ అయ్యింది. తాజాగా మళ్ళీ వైరల్ అవుతుంది.ఢిల్లీలో సూర్యుని భగ భగలు కొనసాగుతున్నాయి. ఇటీవల వర్షం కురిసినా కానీ మళ్లీ ఎండ వేడిమికి కొనసాగుతోంది. ఆదివారం నాడు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర రాజస్థాన్ ఇంకా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో 10వ తేదీ తర్వాత వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శనివారం నాడు కూడా 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: