పెళ్ళయిన కొత్తలో భార్యకు చుక్కలు చూపించాలని అనుకుంటారు.ఒక్కోసారి బాగా పనిచెస్తుంది.. కానీ కొన్నిసార్లు అది ఫెయిల్ అవుతుంది..అలాంటి వాళ్ళు సెక్స్ కోరికలను పెంచడానికి వయగ్రా లాంటి మాత్రలను వేసుకుంటారు. అయితే కొన్ని సార్లు అవి ఫెయిల్ అవ్వడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.ఇప్పుడు కూడా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..ఫ్రెండ్ మాట విని వయగ్రా ఎక్కువ వేసుకున్నాడు.. చివరికి ఆసుపత్రి పాలయ్యాడు.ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.


వివరాల్లొకి వెళితే..ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ వ్యక్తి కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఫ్రెండ్స్ సలహాల మేరకు వయాగ్రా తీసుకోవడం మొదలు పెట్టాడు. అయితే, రికమెండ్ చేసిన క్వాంటిటీ కంటే కూడా ఆ వ్యక్తి ఎక్కువగా తీసుకోవడం ఆరంభించాడు. ఇది క్రమంగా ఓవర్ డోస్ తీసుకునే వరకు వెళ్లింది. ఫలితంగా ఆయన హాస్పిటల్ పాలు కావాల్సి వచ్చింది.స్నేహితుల మాటలు విని ఆ నూతన వరుడు రికమెండ్ చేసిన దానికి నాలుగు రెట్లు అధికంగా వయాగ్రా డోసు తీసుకున్నాడు. 200 ఎంజీ వయాగ్రా డోసు తీసుకున్నట్టు తెలిసింది. ఫలితంగా ఆయనకు ఎవరికీ చెప్పుకోలేని వింత సమస్య వచ్చి పడింది. ఎరెక్టల్ డిస్‌ఫంక్షన్ ఉన్నప్పుడు సాధారణంగా ఈ వయాగ్రా రికమెండ్ చేస్తారు. కానీ, ఈ టాబ్లెట్స్‌ను ఓవర్ డోసుగా తీసుకోవడంతో ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ సరిగా ఫంక్షన్ చేయలేదు.



సుమారు 20 రోజుల పాటు ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ ఎరెక్ట్ అయ్యే ఉన్నట్టు ఓ కథనం వెల్లడించింది.దాంతో కొత్త పెళ్ళి కూతురు తల్లి గారింటికి వెళ్ళిపోయింది.మళ్ళీ అబ్బాయి బంధువులు అందరు కలిసి ఆమెకు నచ్చ చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చారు.ఆ యువకుడికి వైద్యులు చికిత్స అందించారు. పెనైల్ ప్రొస్థెసిస్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆ యువకుడు జీవిత కాలం వెంటాడే సమస్యను వెంట పెట్టుకున్నాడు. ఆ యువకుడు పిల్లలను కనడానికి యోగ్యుడిగానే ఉంటాడని, కానీ, ఆయన ప్రైవేట్ పార్ట్‌లో టెన్షన్ కారణంగా ఎప్పటికీ పూర్తిగా చల్లబడదని వివరించారు. ఆయన జీవితాంతం టైట్ క్లాత్స్ ధరించి తన ప్రైవేట్ పార్ట్‌ను కవర్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇవి మానసికంగా కుంగదీసే సమస్యలు అయినప్పటికీ అతను కొద్దిగా జాగ్రత్తలు వహించాలి.ఇదే అంటారు..ఎరక్క పోయి ఇరుక్కు పోవడం అంటే..


మరింత సమాచారం తెలుసుకోండి: