ఏనుగులు, సింహాలు, చిరుతపులులు, కోతులు, పక్షులకు సంబంధించిన వీడియోల ను చూసేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని సార్లు ఆకస్మాత్తుగా జరిగిన సంఘటనలు అక్కడే ఉన్న కెమెరాలో రికార్డ్ అవుతుంటాయి. అలాంటి వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. ఈ వీడియోలు నవ్వులు పూయించడమే కాకుండా.. ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. పాపం.. ఓ కొండముచ్చు కు అమ్మాయిపై తెగ కోపం వచ్చేసినట్టుంది.. వెంటనే వెళ్లి ఎగిరి తన్నింది. దీంతో అమ్మాయి కింద పడిపోయింది..
ఆ వీడియోలో ఓ పాఠశాల ముందు అందరు విద్యార్థులు నిల్చుని ప్రార్దన చేస్తున్నారు. అక్కడే విద్యార్థులందరూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిల్చుని ఉన్నారు. ఆకస్మాత్తు గా అక్కడకు వచ్చిన ఓ కొండముచ్చు ఓ వరుస చివర లో ఉన్న అమ్మాయిన దగ్గరు వెళ్లి వెనక నుంచి ఎగిరి తన్నింది. దీంతో ఆ అమ్మాయి కింద పడిపోయింది. కొండముచ్చు దాడిని చూసి అక్కడున్నవారంత షాకయ్యారు.. ఏం జరిగిందని తెరుకునేలోపే ఆ కొండముచ్చు అక్కడి నుంచి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వీడియో సోషల్ మీడియా లో క్షణాల్లొ వైరల్ అయ్యింది.. మీరు ఆ వీడియో ను చూడండి..