సాధారణంగా కండోమ్ ను ఎందుకు వాడతారో అందరికి తెలుసు.. గర్భదారన కాకుండా ఆపేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాదు.. సుఖ వ్యాధులు దరిచేరకుండా ఉండడానికి కండోమ్‌ల ను ఉపయోగించాల ని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే స్వయంగా ప్రజలకు ఉచితంగా కండోమ్‌ల ను పంచిపెడుతుంటారు.. అలా కాకుండా సొంతంగా కొనుగోలు చేసుకున్నా మహా అయితే రూ. 100 లోపే లభిస్తాయి. మరి ఒక్క కండోమ్‌ ప్యాకెట్‌ రూ. 60 వేలు పలికితే. అవును మీరు చదివింది నిజమే..
 

అయితే ఈ పరిస్థితి ఉంది మన దేశం లో కాదు లేండి వెనిజులా లో. ఈ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే దీనికి కారణం. వెనిజుల ఆర్థిక సంక్షోభం కారణం గా దేశం లో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ధరలు విపరీతం గా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఒక్క కండోమ్‌ ప్యాక్‌ భారత కరెన్సీ లో ఏకంగా రూ. 60 వేల కు చేరింది. వెనిజుల లో ఈ రేంజ్‌లో కండోమ్‌ ధర పెరగడానికి కారణం అక్కడి చట్టాలే. వెనిజులా లో అబార్షన్‌లు చట్ట విరుద్ధం.. అందుకే జనాలు ఎక్కువగా అబార్షన్ నివారించెందుకు కండోమ్ లను వాడుతున్నారు.


2015 ఐక్య రాజ్యసమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా యువతులు గర్భిణీలున్న దేశాల్లో వెనిజులా ఒకటి. ఈ నేపథ్యం లోనే ఈ దేశం లో అబార్షన్‌ చట్టాల ను కఠినతరం చేశాయి. దీంతో పెద్ద ఎత్తున కండోమ్‌ల కు డిమాండ్‌ పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం వెనిజులా లో నెలకొన్ని పరిస్థితుల పై సోషల్‌ మీడియా లో పోస్ట్‌లు వైరల్‌ అవుతున్నాయి. కండోమ్‌ ధరలు ఈ రేంజ్‌లో పెరగడం తో ఆ దేశం లో ప్రజలు ఏం చేయలేని స్థితి లో తలలు పట్టుకుంటున్నారు... ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుడదు అని అంటున్నారు.. మొత్తానికి అక్కడ డిమాండ్ మాత్రం భారీగా పెరిగింది..


మరింత సమాచారం తెలుసుకోండి: