ఈ మధ్య సోషల్ మీడియా లో రకరకాల వీడియోలు చక్కర్లు కోడుతున్నాయి.. అందులో పెళ్ళికి సంభందించిన వీడియోలు ఎక్కువగా చక్కర్లు కోడుతున్నాయి. కొన్ని వీడియోలు మనుషుల కు కోపాన్ని తెప్పిస్తె.. మరి కొన్ని వీడియోలు.. కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని విపరీతమైన నవ్వును తెప్పిస్తాయి. అయితే మరికొన్ని మాత్రం షాకిస్తుంటాయి. ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో లో వివాహం అనంతరం రిసెప్షన్‌ లో ఓ జంట వేదిక పై ఒక గేమ్‌ ఆడుతున్నట్లు చూడొచ్చు.
 

అయితే, గేమ్ ఆడుతుండగానే, ఏమైందో ఏమో గానీ, ఒక్క సారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. వధువు గేమ్‌లో గెలిచినందుకు, తట్టు కోలేకపోయిన వరుడు ఏం చేశాడో చూస్తే, షాకవుతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వెరలవుతోంది. నెటిజన్లు వరుడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కామెంట్ల తో తిట్టిపోస్తున్నారు. అసలు ఈ వీడియో లో ఏముందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రిసెప్షన్‌ లో సరదాగా ఓ గేమ్ ఆడుతున్నారు. అయితే ఈ గేమ్‌లో వధువు గెలిచింది. దీంతో ఆగ్రహించిన వరుడు, ఒక్కసారిగా ఆమె పై దాడి చేశాడు. వధువు తలపై గట్టిగా కొట్టేశాడు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

 

ఈ తర్వాత పెళ్లికొడుకు మాత్రం ఏమీ పట్టనట్టుగా వేదికపైనే నిలుచున్నాడు. అతను నిశ్శబ్దం గా జనాల వైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఈ సమయం లో పాటలు కూడా ప్లే అవుతూనే ఉన్నాయి. కాగా, ఈ ఘటన తర్వాత ఏం జరిగిందన్న సమాచారం మాత్రం తెలియలేదు.. ఈ వీడియో పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇది భరించలేనిది. వరుడికి తగిన శిక్ష పడాలి' అని ఓ యూజర్ కామెంట్ చేయగాఅవి కాస్త ట్రెండ్ అవుథున్నాయి.. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా లో లెక్కలెనన్ని వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: