ఇక ఈ రోజుల్లో చాలామంది ప్రజలు కూడా ఆన్‌లైన్ షాపింగ్‌కి అలవాటు పడ్డారు. ఏది కావాలన్నా కూడా వారు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. అయితే ఈ-కామర్స్ కంపెనీలు ఒక్కోసారి యూజర్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇస్తున్నాయి.ఇక ఇవి ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరొక వస్తువు పంపిస్తూ కస్టమర్లను దెబ్బకు ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. తాజాగా ఒక అమెరికా యువతికి కూడా ఇలాంటి షాకింగ్ పరిస్థితి ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో తెగ వైరల్ అవుతోంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా దేశం, నూయార్క్‌ నగరానికి చెందిన 29 ఏళ్ల జెన్ బెగాకిస్ కి ఒక వింత అనుభవం అనేది ఎదురయింది. అదేంటంటే ఆమె రీసెంట్ గా అమెజాన్‌లో ఒక స్మాల్ లెదర్‌ కుర్చీని ఆర్డర్ చేస్తే ఆమెకు వేరే వస్తువు వచ్చింది. ఇక ఆ వస్తువు చూసి ఆమె మొదట షాక్ తింది. ఎందుకంటే ఆ పార్సిల్‌లో చాలా ఆమె ఆర్డర్ చేసిన కుర్చీ విడిభాగాలు మాత్రమే ఆమెకు కనిపించాయి. అలాగే ఒక గ్లాస్ ట్యూబ్ కూడా అందులో కనిపించింది. ఆ ట్యూబ్ నిండా కూడా రక్తమే ఉంది. దీన్ని చూసిన ఆమె దెబ్బకు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 'ఇక అసలు నేనేం ఆర్డర్ చేశాను. వారి ఏం పంపించారు. అసలకి ఈ రక్తం ఎవరిది' అని ఆలోచనలతో ఆమె తల గిర్రున తిరిగింది.


 డెలివరీ లో ఇవి ఎలా వచ్చాయో ఆమెకు అర్థం కాక ఆమె చాలా సేపు మూగబోయింది. ఇక ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె పేర్కొంది. ఈ ప్యాకేజ్‌కి సంబంధించిన వీడియోను కూడా ఆమె షేర్ చేసింది.ఇంకా అలాగే అలాగే అమెజాన్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి ఈ విషయం గురించి తెలిపింది. దీంతో వారు ఆమె ఆర్డర్ డీటెయిల్స్ ని సేకరించి ఈ డెలివరీని ఎవరు ప్యాక్ చేశారనేది తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే కస్టమర్లను భయపెట్టే ఇలాంటి తప్పుడు డెలివరీలు కూడా పునరావృతం కాకుండా అమెజాన్ జాగ్రత్తలు తీసుకోవడానికి రెడీ అయింది. అయితే ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు కూడా ఇలా ఎలా జరుగుతుంది అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే తనకి కూడా అర్థం కావడం లేదని ఇంకా తానూ చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నానని ఆమె పేర్కొంది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: