ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయి అన్నది దాదాపు ఎవ్వరి ఊహకందని విధంగానే ఉంటుంది. ఒకవేళ ప్రమాదాలు జరుగుతాయని  తెలిస్తే.. ఎవరైనా ప్రమాదం బారిన పడటానికి సిద్ధంగా ఉంటారా. ఇకపోతే  కార్ అయినా బైక్ అయినా డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన చివరికి ప్రమాదం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాల మీదికి కూడా వస్తుంది అని చెప్పాలి. అయితే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయన్న దానికి నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.


 ఇక ఇలా సోషల్ మీడియాలో తెరమీదికి వచ్చిన కొన్ని వీడియోలు అందర్నీ భయాందోళనకు గురి చేస్తూ ఉంటే.. మరి కొన్ని వీడియోలు మాత్రం నవ్వులు పూయిస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక ఇలా సోషల్ మీడియాలో ఆక్సిడెంట్ కి సంబంధించిన వీడియోలు కు కొదవ లేదు అని చెప్పాలి. ఎప్పుడూ ఏదో ఒక వీడియో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక ఇటీవల ఇలాంటి ఒక వీడియో నే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో లో కారు ప్రమాదానికి గురైన తీరు చూస్తే భయం పుట్టడం కాదు నవ్వు వస్తూ ఉంటుంది. కొంతమంది కారు నడిపేటప్పుడు తొందర పడుతూ ఉంటారు ఇక్కడ డ్రైవర్ తొందరపడి చివరికి కార్ నుజ్జునుజ్జు అయ్యేలా చేశాడు.


 ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే సర్వీసింగ్ కోసం ఒక వ్యక్తి తన కారును తీసుకొని వచ్చాడు. ఈ క్రమంలోనే వాషింగ్ కోసం ఓ బేస్ మెంట్ ను కార్ ఎక్కించాల్సి ఉంది. అక్కడ ఉన్న వ్యక్తి ఇకముందుకు ఎలా రావాలి అన్నది సూచనలు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బేస్మెంట్ పైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత తొందర పడ్డాడు. అక్కడ ఉన్న వ్యక్తి ఆపమని హెచ్చరిస్తుంటే కారు అతని పైకి ఎక్కించపోయాడు. ఇక కారు ఆపమని ఎంత చెబుతున్నా వినకుండా కారు ఎక్సలేటర్ ను గట్టిగా తొక్కాడు. దీంతో కారు కంట్రోల్ తప్పి ముందు ఉన్న గోడను గుద్దింది. దీంతో కారుకు ఊహించని రేంజిలో డ్యామేజ్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: