సాధారణంగా మనం ప్రతి రోజూ సినిమాలు సీరియల్స్ టీవీ లో చూస్తూనే ఉంటాము. కానీ ఎప్పుడైనా యానిమల్ ప్లానెట్,  డిస్కవరీ ఛానల్ చూస్తే.. అందులో కనిపించే దృశ్యాలు ప్రతి ఒక్కరిని అబ్బుర పరుస్తూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక ఎంతో మంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లు పెద్ద పెద్ద అడవుల్లోకి వెళ్లి సింహాలు పులులు చిరుత పులులు లాంటి వాటి వేటాడే విధానాన్ని ఎంతో దగ్గర నుంచి క్యాప్చర్ చేస్తూ ఉంటారు. ఇక ఇదే టీవీ లో ప్లే చేస్తూ ఉంటే ఇక క్రూరమృగాలు వేటాడుతున్న తీరు చూసిఅందరూ ఆశ్చర్యంతో మునిగిపోతూ ఉంటారన్న విషయం తెలిసిందే.



 సాధారణంగా సింహాలు ఇక తమ వేటను కేవలం భూమి మీద మాత్రమే చేస్తూ ఉంటాయి. కానీ చిరుతపులులు మాత్రం తమ ఆహారం కోసం ఎన్నో రిస్కులు చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. పెద్ద పెద్ద చెట్లు సైతం ఎంతో అలవోకగా ఎక్కేస్తూ చెట్ల మీద దాక్కుని ఉన్న జంతువులను కూడా వేటాడుతూ ఉంటాయి. ఇలాంటి వేటాడే వీడియోలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటాయ్. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారిపోతుంది. ఒక పెద్ద చెట్టు మీద చిరుతపులి పిల్ల కోతి ని వెంటాడిన తీరు ప్రస్తుతం నెటిజన్లు అందర్నీ కూడా నోరెళ్ళబెట్టేలా చేస్తుంది అని చెప్పాలి.


 మధ్యప్రదేశ్ లోని పన్నా టైగర్ రిజర్వ్ లో ఈ ఘటన జరిగింది. పన్న టైగర్ రిజర్వ్ అధికారులు ట్విట్టర్లో ఈ వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఎంతో చాకచక్యంగా కోతి పిల్లను చిరుతపులి పట్టుకుంది. ఒక చెట్టు పై చిరుతపులి మరో చెట్టు పై కోతి పిల్ల ఉంది. సరిగ్గా కోతిపిల్ల జీవితాన్ని చిరుతను చూసి తప్పించుకునే సమయానికి ఒక్కసారిగా ఎగిరి పక్క చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకి వెళ్లి మళ్లీ రివర్స్ జంప్ చేసి అతి వేగంగా కోతి పిల్లను పట్టుకుంది. అంతే కాదు ఎంతో జాగ్రత్తగా భూమి మీద ల్యాండ్ అయింది. ఇక కిందపడగానే ఏమీ తెలియనట్లుగా ప్రశాంతంగా కూర్చుంది. ఇక ఇది వీడియో తీస్తున్న  వారు సైతం అవాక్కయ్యారు. అయితే ఇది చూసిన తర్వాత ఈ చిరుతకు బెస్ట్ క్యాచ్ అవార్డు ఇవ్వలేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir