ఇటీవలి కాలంలో మనుషులు కష్టపడి పని చేయడం ఎలా అనే దానికంటే.. ఉన్న పనిని ఎంతో సులభంగా చేయడం ఎలా అనే విషయంపైనే ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వినూత్నంగా ఆలోచించి చేసే విచిత్రమైన పనులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్. అంతే కాకుండా ఇలాంటి పనులు అటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక సాదాసీదా విషయానికి వినూత్నమైన  ఆలోచన తోడైతే ఎలాంటివి చేయవచ్చు అని ఇక్కడ ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది అని చెప్పాలి. వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు.


 ఇటీవలి కాలంలో ఎంతోమంది యువకులు ఎలాంటి టెక్నాలజీ తమ దగ్గర అందుబాటులో లేక పోయినప్పటికీ ఉన్నదాంట్లోనే సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. కొంతమంది వినూత్నమైన కార్లను తయారు చేస్తుంటే.. మరికొంతమంది ఎలక్ట్రికల్ బైక్ లను కూడా తయారు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా హెలికాప్టర్ లను తయారుచేసి గాల్లో  తిరిగేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇంకొంతమంది పొలాల నుంచి పక్షులను తరిమికొట్టేందుకు ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ని వాడేస్తు అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ఇలాంటి ఒక వింత ఐడియా కు శ్రీకారం చుట్టారు అనేది తెలుస్తుంది.


 మీరు రోడ్లపై చెరుకు రసం తాగి ఉంటారు. ఇటీవలి కాలంలో గ్రామంలో ఉండే బండ్ల ద్వారానే చెరుకు రసం తీస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఇక కర్ర పట్టుకొని చుట్టూ తిప్పుతూ ఉంటే ఇక చెరుకు గడలను ఆ యంత్రాల మధ్య పెట్టి ఇక రసం తీస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం వినూత్నమైన ఆలోచన చేసి బైక్ సాయం తో చెరుకు రసం తీయాలి అని భావించాడు. దీంతో చెరుకు యంత్రానికి ఉండే పొడవాటి కర్రను బైక్ కి కట్టి  ఇక గుండ్రంగా తిరగడం మొదలుపెట్టాడు. మరో ఇద్దరు వ్యక్తులు ఇక యంత్రం మధ్యలో చెరుకుగడలు పెట్టి వాటి ద్వారా రసం తీస్తున్నారు. ఇది చూసి వామ్మో ఇదేమి ఐడియా రా బాబు అంటూ నిజంగా షాక్ అవుతున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: