సాధారణంగా కొన్ని కొన్ని సార్లు వీధికుక్కలు రెచ్చిపోయి మనుషులపై దాడి చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే ఎక్కడకైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ కుక్కలు ఉన్నాయా లేవా అని కాస్త భయపడుతూనే వెళుతూ వుంటారు చాలామంది. ఒకవేళ కుక్కలు ఉండి ఆ కుక్కలు మనకి మన వైపే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఇక గుండెలు జారిపోయినంత పని అవుతుంది.. అంతేకాదు ఈ కుక్కలు పరుగెడుతూ ఉంటే అక్కడినుంచి పరిగెత్తడం లేకపోతే ఏదో ఒక విధంగా తప్పించుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 సాధారణంగా ఒకటి లేదా రెండు కుక్కలు వచ్చినప్పుడు అందరూ భయపడి పోతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం 8 కుక్కలు యువకుడిని చుట్టుముట్టాయి. దీంతో ఇది కాస్త సంచలనంగా మారింది అని చెప్పాలి. ఇలా 8 కుక్కలు అతని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ లో పెట్టేసి దాడి చేయడానికి రెడీ అయ్యాయి. ఆ సమయంలో ఆ యువకుడికి ఏం చేయాలో అర్థం కాలేదు.. ఆ తర్వాత ఒక వినూత్నమైన ఆలోచన చేసాడు. క్షణకాలంలో అప్రమత్తమైన యువకుడు ముందు ఉన్న కర్రను తీసుకొని సూపర్ హీరోల వాటిపై దాడి చేయడం మొదలుపెట్టాడు.



 ఈ క్రమంలోనే 8 కుక్కలకు భయపడటం కాదు వాటిని భయ పెట్టేందుకు గుండ్రంగా తిరుగుతూ ఇక యాక్షన్ సీక్వెన్స్ చేసాడు.ఆ యువకుడు. అయినప్పటికీ ఆ కుక్కలు వదలకుండా కరవడానికి ప్రయత్నించాయ్. ఈ క్రమంలోనే యువకుడు సూపర్ ఫాస్ట్ గా ఆ కుక్కలు అన్నింటినీ కూడా హ్యాండిల్ చేశాడు అని చెప్పాలి.   ఎంతో చాకచక్యంగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారిపోవడంతో అతని దైర్య సాహసాలు చూసి అందరూ సాంగ్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: