కొందరు చేస్తున్న పని చూస్తె వాళ్ళను ఏం చేసిన పాపం లేదు అని అనిపిస్తుంది.అంత దారుణంగా చేస్తున్నారు. పది మంది తినే ఫుడ్ చేస్తున్న సమయంలో ఎంత జాగ్రత్తగా వుండాలి కానీ ఓ వ్యక్తి మాత్రం ఉమ్ము వేస్తూ వంట చేశాడు.ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.ఈసారి బిజ్నోర్‌లోని ఓ హోటల్‌లో అర్బాజ్ అనే యువకుడు రోటీలు తయారు చేస్తూ వాటిపై ఉమ్మివేస్తూ పట్టుబడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత స్థానిక పోలీసులు నిందితుడు హోటల్ ఆర్టిజన్ అర్బాజ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన నజీబాబాద్‌లోని జలాలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది.. నిందితుడు అర్బాజ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంతకుముందు, రాజధాని లక్నో, మీరట్ నుండి కూడా తయారుచేస్తున్న ఫుడ్‌ ఐటమ్స్‌పై ఉమ్మి వేసిన కేసులు నమోదయ్యాయి.


జలాలాబాద్ చౌక్‌లో ఎవర్‌గ్రీన్ పేరుతో ఓ హోటల్ ఉందని చెబుతున్నారు. హోటల్‌లో నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన ఓ వ్యక్తి రోటీ తయారు చేస్తున్న వ్యక్తిని చూసి షాక్‌ అయ్యాడు. అతడు రోటీ తయారు చేసేటప్పుడు ఉమ్మి వేస్తున్నాడు. దాంతో ఇక ఆ వ్యక్తి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రోటీ చేస్తున్న వ్యక్తి చర్యను కెమెరాలో రికార్డ్‌ చేశాడు. తరువాత ఈ వీడియోను వైరల్ చేశాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఆర్బాజ్‌ను అరెస్టు చేశారు. ఆర్టిజన్ అర్బాజ్ ఎందుకు, ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నాడు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.


అతని పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. గత సంవత్సరం, లక్నోలోని కాకోరి ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న దాబాలో రోటీలు చేయడానికి పిండిపై ఉమ్మివేస్తూ పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీని తరువాత, ఫిబ్రవరిలో, మీరట్‌లో పిండిపై ఉమ్మి వేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.ఇలా ఎన్నో ఘటనలు వార్తలలో చూస్తున్నాము..ఇలాంటి వారిని దారుణంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: