సముద్రం అంటే ఎన్నో జీవులకు నిలయం..ఎంత నీరు వుంటుందో అంతకు మించి జంతువులు, జీవ రాసులు.. ఎన్నో మొక్కలు, సంపద ఇలా చెప్పుకుంటూ పోతే అనంతం అని చెప్పాలి..అయితే సముద్ర గర్భంలోకి వెళ్లే వారు కూడా ఎక్కువ మందె ఉంటారు. కొంతమంది సాహాసం చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు..అయితే  ఈ మధ్య సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ ఏమున్నాయి అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు... అలా వెళ్ళిన ఓ వ్యక్తికి అనుకోని అతిధి కాసేపు ముచ్చట్లు చెప్పింది.


ఓ ఆట ఆడుకుంది.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలొ వైరల్ అవుతుంది..లోతైన సముద్రగర్భం అద్భుతమైన జీవులతో నిండి ఉంటుంది. వీటిని చూసేందుకు రెండు కళ్లు చాలవు. వింత ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉంటుంది.సముద్రపు లోతుల్లో అత్యంత విశేషమైన జీవి ఆక్టోపస్. ఇది ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా ఉంటుంది. తాజాగా ఓ సముద్ర గర్భంలో స్కూబా డ్రైవర్ ఆక్టోపస్ తో ఆడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను బ్యూటెంటేబిన్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఉల్లాసభరితమైన చిన్న ఆక్టోపస్ అని ట్యాగ్ చేశారు.


సముద్రపు అడుగు భాగానికి వెళ్లిన స్కూబా డ్రైవర్ ఆక్టోపస్ ను చూశాడు. దాని వద్దకు వెళ్లి అరచేతిని అడ్డుగా పెట్టాడు. దీంతో ఆక్టోపస్ స్పందించి చేతివైపుకు దూసుకొచ్చింది. అలా అరచేతితో తాకుతూ వెళ్లూ.. కొద్దిసేపు ఆక్టోపస్ స్కూబా డ్రైవర్ తో ఆడుకోవటం మనం వీడియోలో చూడొచ్చు. కొద్దిసేపటి తరువాత ఆక్టోపస్ అతడి చేతిపైకి వచ్చింది. అతడు దానిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నట్లు వీడియోలో ఉంది..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేశారు. ఓ నెటిజన్.. 'ఆక్టోపస్ అతనిని కౌగిలించుకుంది..ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కామెంట్ చేశారు..మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: