సాధారణంగా అటవీ ప్రాంతాల్లో లారీలు ఇతర వాహనాలు టాక్స్ చెల్లించకుండా ఉండేందుకు దొడ్డ  దారిలో వెళ్లడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తూ తనిఖీలు చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో లారీలు ఇతర వాహనాల నుంచి పోలీసులు ట్యాక్స్ వసూలు చేయడం మీరు విని చూసి ఉంటారు. కానీ ఏకంగా ఏనుగులు టాక్స్ వసూలు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా.. ఏనుగు టాక్స్ వసూలు చేయడం ఏంటి బాసు అవేమైనా పోలీసులా అని అంటారు ఎవరైనా..


 కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఏనుగులు ట్యాక్స్ వసూలు చేయడం కాస్త సంచలనంగా మారిపోయింది.  ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరా అని అనుకుంటున్నారు కదా.. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కేశ్వన్ తన ట్విట్టర్లో ఈ వీడియో ని పంచుకున్నారూ. అధికారి పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే.. టాక్స్ కట్టకుండానే ఒక లారీ చెరుకు లోడుతో వెళ్తుంది. ఇక ఇది గమనించిన ఏనుగులు రోడ్డుకి అడ్డంగా నిలబడ్డాయ్. ఆ లారీని ఆపేసాయ్. ఈ క్రమంలోనే లారీ డ్రైవర్ కు విషయం అర్ధం అయింది.


 ఇక ఏనుగులకు టాక్స్ చెల్లించాల్సిందే అంటూ ఫిక్స్ అయ్యాడు లారీ డ్రైవర్. చివరికి కావాల్సినంత టాక్స్ థాంక్స్ ఇచ్చాడు దీంతో ఏనుగులు పక్కకు తప్పుకున్నాయ్. ఇంతకీ ఏనుగులకు చెల్లించిన టాక్స్ ఏంటో తెలుసా చెరుకుగడల. చెరుకు లోడుతో  వెళ్తున్న లారీ లో నుంచి కొన్ని చెరుకుగడలు కిందకు పడేసాడు.  దీంతో ఆ ఏనుగులు ఆ లారీ కి దారి ఇచ్చాయి  అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ వీడియో ని పోస్ట్ చేసిన ఐఏఎఎఫ్ అధికారి ఇక ఇలాంటి టాక్ ను మీరేమంటారు అంటూ ఒక ప్రశ్న కూడా అడిగాడు. ఇక ఏనుగులు ఏకంగా టాక్స్ వసూలు చేసిన తీరు చూసి అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: