సాధారణంగా జంతుప్రదర్శన శాల కు వెళ్ళినప్పుడు పులిని కాస్త దగ్గరగా చూశాము అంటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. అదే సమయంలో యానిమల్ ప్లానెట్ లో ఎంతోమంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లూ పులిని చాలా దగ్గరి నుంచి చూపిస్తూ ఉంటే భయపడుతూ ఉంటారు. అలాంటిది ఇక పులి కళ్ళముందు కనిపిస్తే భయంతో ప్రాణాలు గాల్లో కలిసి పోవడం ఖాయం అని చెప్పాలి. పులితో ఫోటో దిగాలి అనుకో తప్పులేదు.. కానీ చనువు ఇచ్చింది కదా  అని పులితో ఆటలాడితే మాత్రం వేటాడేస్తది అని యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తూ ఉంటుంది పులిని చూసి నప్పుడు. దీంతో అంత రిస్క్ ఎందుకని ఇక జంతు ప్రదర్శన శాలలో కూడా కాస్త దూరంగానే ఉంటారు ఎంతోమంది.


 అయితే ఇటీవలి కాలంలో కొంతమంది మాత్రం ఏకంగా క్రూరమృగం అయినా పులితో ఆటలు ఆడుకుంటూన్న  వీడియోలు సోషల్ మీడియాలూ పోస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఏకంగా పెంపుడు జంతువులు కుక్కలను పంచుకున్నట్లు ఏకంగా భారీ ఆకారంలో ఉన్న పులులను పెంచుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా  పులితో ఆటలు మాత్రం ఇప్పటికీ ప్రమాదకరమే అన్నది అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ప్రదర్శించిన ధైర్యానికి ప్రస్తుతం అందరూ ఫిదా అవుతున్నారు.


 సాధారణంగా పులి కనిపిస్తే అందరూ భయపడిపోతుంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం మాంసం ముద్దలను ఏకంగా పులికి తినిపించాడు. పులి వచ్చి మాంసం ముద్దను తింటూ ఉంటే అతను భయపడకుండా అలాగే చూస్తూ వీడియో తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సదరు వ్యక్తి ధైర్యానికి ప్రస్తుతం నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు అంత తెలివితక్కువ పని అవసరమా అంటూ కొంతమంది తిట్టిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: