సాధారణంగా వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా వెనక ముందు అన్ని చూసుకోవాలి అని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరికి చేజేతులారా ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కొంతమంది చేసే చిన్న చిన్న పొరపాట్లే ఏకంగా వారిని తీవ్ర గాయాల పాలు  చేస్తూ ఉంటాయి. ఇలా ఇటీవలి కాలంలో వాహనదారులు నిర్లక్ష్యంతో చేసిన పనులు వారి ప్రాణాలమీదికి తెచ్చిన ఘటనలకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇలా వైరల్ గా మారిపోయిన కొన్ని వీడియోలు అందరినీ షాక్ కి గురి చేస్తూ ఉంటే.. మరి కొన్ని వీడియోలు మాత్రం ఎంతో మందికి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న తన బైక్ను తీయాలని భావించాడు ఇక్కడ ఒక యువకుడు. అయితే వెనక ముందు చూసుకోకుండా బైక్ ని రివర్స్ చేయబోయాడు. దీంతో వెనుక ఉన్న ఒక పెద్ద గుంతలో ద్విచక్ర వాహనంతో సహా పడిపోయాడు. ట్విట్టర్ ఖాతాలో ఒక నేటిజన్ వీడియో ని పోస్ట్ చేయగా వైరల్ గా మారిపోయింది.


 జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అనే క్యాప్షన్ తో ఈ వీడియో ని పోస్ట్ చేయడం గమనార్హం. 8 సెకన్లు ఉన్న ఈ వీడియో నెటిజన్లు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఒక వ్యక్తి తన మోటార్ సైకిల్  రివర్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలోనే దుకాణం ముందు ఉన్న ఒక పెద్ద పొయ్యి మాత్రం గమనించలేదు. చివరికీ వెనకాల టైర్ అదుపు తప్పి లోయలోకి వెళ్ళిపోయింది. అయితే అతడు బైకును ఎంత కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. చివరికి ద్విచక్ర వాహనం తో పాటు అతడు కూడా గొయ్యిలో పడిపోయాడు. ఇది చూసి అందరూ అవాక్కవుతున్నారు. అతనికి ఏమీ కాలేదు కదా అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: