ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఛాలెంజ్ వైరల్ గా మారి పోతూనే ఉంది అనే విషయం తెలిసిందే. ఇక ఇలా వైరల్ గా మారిపోయిన ఛాలెంజ్లో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది మాత్రం ఫుడ్ ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇటీవలి కాలంలో ఎన్నో రెస్టారెంట్లో తమ పాపులారిటీని పెంచుకోవడానికి వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎవరికీ సాధ్యం కాని ఫుడ్ ఛాలెంజ్ ఇస్తూ భారీ నజరానా కూడా ప్రకటిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి ఛాలెంజ్ లో పాల్గొన్న ఎంతో మంది యువత చివరికి ఓడిపోతూ ఉంటే ఎవరో ఒకరు గెలిచి అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారూ అని చెప్పాలి.


 ఇలా రెస్టారెంట్ నిర్వాహకులు ఇచ్చినా ఫుడ్ చాలెంజ్ ప్రకారం ఆహారాన్ని తినగల్గితే ఊహించని రీతిలో క్యాష్ ప్రైజ్ లేదా బహుమతులు ఇస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా చేయడం ద్వారా ఒకవైపు రెస్టారెంట్ కు ఊహించని రీతిలో పాపులారిటీ తో పాటు మరో వైపు ఎంతోమంది ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఓడిపోవడం కారణంగా డబ్బు కూడా వస్తుంది అని చెప్పాలి. ఇక ఇలా తరచూ ఫుడ్ ఛాలెంజ్ నిర్వహించే రెస్టారెంట్లలో ఢిల్లీలోని చోలే కుల్చా రెస్టారెంట్ కూడా ఒకటి. ఇటీవలే ఆహార ప్రియులందరికీ కూడా మరో అదిరిపోయే సవాల్ విసిరింది ఈ రెస్టారెంట్. అదేంటంటే అరగంటలో ఇరవై ఒక ప్లేట్ల మటర్ చోలే కూల్చే తినాలి.


 అయితే ఇది తలుచుకుంటేనే ప్రతి ఒక్కరికి భయమేస్తుంది. ఎందుకంటే 21 ప్లేట్ల చోలే కుల్చే  కేవలం అరగంటలో తినడం అంటే అంత సులభమేమీ కాదు. అంతేకాదండోయ్ ఇక ఇలా 21 ప్లేట్ల మటర్ చోలే కుల్చే  తిన్నవారికి ఏకంగా బుల్లెట్ బైక్ బహుమతిగా ఆఫర్ చేసిం.ది అయితే ఇక్కడ ఒక యువకుడు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి కంప్లీట్ చేశాడు.  తింటున్న సమయం లో అరగడానికి  మధ్యమధ్యలో 6, 7 గ్లాస్ జ్యూస్ కూడా తాgaడు. మధ్యలో గెంతడం వ్యాయామాలు చేయడం లాంటివి కూడా చేశాడు. నిబంధనల ప్రకారం 30 నిమిషాల్లో 21 ప్లేట్ల చోలే కూల్చా తిని  ఏకంగా బుల్లెట్ బండి బహుమతిగా పొందాడు అని చెప్పాలి. కానీ ఆ తర్వాత ఎందుకొ ఆ బైక్ మళ్లీ యజమానికి తిరిగి ఇచ్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: