ఇటీవలికాలంలో జనాలు ఆలోచించే శక్తిని పూర్తిగా మరిచిపోయారు ఏమో అని అనిపిస్తూ ఉంటుంది నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే.. చిన్న విషయాలకి కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు నేటి రోజుల్లో ఎంతోమంది. ఈ క్రమంలోనే చిన్నచిన్న విషయాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు దేశంలోని ప్రతీ చోట కూడా నేటి రోజుల్లో యువత క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది.


 ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసిందని లేదా ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని.. ఇంకొంతమంది పరీక్షల్లో పాస్ కాలేకపోయాము అని.. మరి కొంతమంది ఎంత అడిగినా ఇంట్లో వాళ్ళు మొబైల్ కొనివ్వడంలేదని.. ఇలా చిన్నచిన్న కారణాలకే ఎంతోమంది ఆత్మహత్యలే శరణ్యం అని భావిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల భార్య తమకు కావాల్సిన ఆహారం వండలేదని.. కొన్ని చోట్ల తననుకుటుంబ సభ్యులు మందలించారని ఇలా చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  ఇలాంటి తరహా ఘటనలు తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాము.


 ఇటీవలే ఇలాంటి ఒక ఒళ్ళు గగుర్పొడిచే ఆత్మహత్య ప్రయత్నానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బైకుల్లా రైల్వే స్టేషన్ పరిధిలో ఒక యువతి రైల్వే ప్లాట్ ఫారం మీద నిలిచి ఉంది. ఆమె దూరం నుంచి లోకల్ ట్రైన్ రావడాన్ని గమనించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎదురుగా నిలబడింది. ప్లాట్ ఫారం మీద ఉన్న వారందరూ కూడా వద్దు వద్దు అని ఎంత వారిస్తున్నా ఆ యువతి మాత్రం వినలేదు.  వెంటనే అప్రమత్తమైన ఆర్పిఎఫ్ పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను పట్టాలా నుంచి పక్కకు తప్పించారు.  ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.  ప్రాణాలకు తెగించియువతి ప్రాణాలు కాపాడిన ఆర్పిఎఫ్ అధికారుల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: