ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన దొంగల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగం చేస్తే నెలకు జీతం వస్తుంది.. ఇక వ్యాపారం చేస్తే నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు. అదే దొంగతనం చేస్తే అందినకాడికి దోచుకోవడం ఆ తర్వాత జల్సాలు చేయడం.. ఇలాగే ఆలోచిస్తున్నారు నేటి రోజుల్లో జనాలు. ఈ క్రమంలోనే చోరీలకు పాల్పడేందుకు  సరికొత్త ప్లాన్ లు వేస్తూ ఉన్నారూ అని చెప్పాలి. అయితే ఎంతో కష్టపడి ఇంట్లోకి చొరబడితే ఏం వస్తుంది అక్కడ డబ్బులు లేకపోతే ఖాళీ చేతులతో బయటకు రావాల్సిందే. అందరికీ డబ్బులు అందించే ఏటీఎంలో చోరీ చేస్తే ఊహించని రీతిలో డబ్బులు చోరీ చేయవచ్చు అనుకుంటున్నారూ.


 వెరసి నేటి రోజుల్లో ఏటీఎంలో కన్నాలు వేసే వారు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఏటీఎంలో హైసెక్యూరిటీ ఉంటుందని.. ఏదైనా తేడా జరిగితే అలారం మోగుతుంది అని.. ఇక పోలీసులు పరిగెత్తుకు వస్తారు అన్న విషయం అందరికి తెలుసు. అయినా ఏటీఎంలో చోరీ చేసి చివరికి దొరికిపోతున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు చివరికి పోలీసులకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.


 ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే ఓ యువకుడు ఏటీఎం పగలగొట్టి అందులో ఉన్న డబ్బులను కాజేసి జేబులో పెట్టుకున్నాడు. ఎవరైనా వస్తున్నారా లేదా అని ఒక వైపు గమనిస్తూనే మరోవైపు తన పని ప్రారంభించాడు. చివరికి ఏటీఎంలో చోరీ పూర్తయిందని హాయిగా లేచి నిలబడి బయటికి వెళదామని ప్రయత్నించాడు. ఇంతలో ఊహించని ట్విస్ట్ పోలీసులు అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. అతని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయితే ఈ ఘటన రాత్రి జరిగింది అనుకుంటే పొరపాటే.. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: