పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరు ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇటీవలి కాలంలో తమ తాహతుకు మించి పెళ్లి చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. కాగా ఇలాంటి తరహా పెళ్లి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక్కడ పెళ్లికి సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఇక్కడ గా వైరల్ గా మారిపోయిన వీడియో మాత్రం ఒక వింత పెళ్లి గురించి అని చెప్పాలి. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు అవ్వకుండా ఉండలేరు. అచ్చంగా ఏకంగా సినిమాల్లోని  సన్నివేశాలకు ఎక్కడ తీసుకోకుండా సస్పెన్స్ డ్రామా విషాదం అన్నీ కూడా ఇక ఈ పెళ్లిలో కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ ఘటన బీహార్లోని నవాడ ప్రాంతంలో జరిగింది. భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడికి సూచించగా పెళ్లి వద్దు బాబోయ్ అంటూ యువకుడు నడిరోడ్డు మీద పరుగులు పెట్టాడు.


 ఇలాంటి సమయంలోనే నాకు అతనే కావాలి  అంటూ వధువు రోడ్డు మీద అతని వెంట పరుగులు పెట్టిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా చెక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే ఇద్దరు యువతీ యువకులకు మూడు నెలల క్రితమే వివాహం నిశ్చయించారు. 50 వేల రూపాయల కట్నం ఒక బైక్ కూడా ఇచ్చారు. అయితే  వివాహ ముహూర్తాన్ని సదరు యువకుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఇటీవలే ఇక వధువు తరపు బంధువులు యువకుడి  ఇంటికి వెళ్లగా పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో సివంగిలా మారింది వధువు.  నన్నెలా వదిలేస్థావో నేను చూస్తా అంటూ అతని వెంట పరుగులు పెట్టింది. చివరికి పోలీస్ స్టేషన్ వరకు ఈ వ్యవహారం చేరడంతో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు వరుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: