రోడ్డు నిబంధనలు పాటించి  ప్రతి ఒక్కరూ ప్రాణాలు కాపాడుకోండి అంటూ అటు ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా వాహనదారులు మాత్రం ఎక్కడా మారడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  తమ ప్రాణాలను తామే ప్రమాదంలో పెట్టుకుంటున్నారు అనే విషయాలను కూడా మరచిపోతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించకుండా హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్నారు. వాహనంపై కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి అనే నిబంధన ఉన్నప్పటికీ ముగ్గురు కూడా ప్రయాణించడం లాంటివి చూస్తూ ఉంటారు.


 అయితే ఇప్పుడు వరకు ఒక వాహనం పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణించడం చూశాము.   అప్పుడప్పుడు నలుగురు కూడా ప్రయాణిస్తూ ఉంటారూ.   కానీ ఏకంగా ఒక బైక్ పై ఏడుగురు ప్రయాణించారు అంటే ఎవరు నమ్మరు అని చెప్పాలి. కానీ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా  తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారు. ఒక బైక్ పై ఏడుగురు ప్రయాణించడాన్నీ  చూసినా నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత ఫ్యామిలీ ప్యాక్ అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.


 ఈ వీడియోలో చూసుకుంటే ఒకే కుటుంబానికి చెందినవారు ప్రయాణిస్తున్నారు అన్నది మాత్రం తెలుస్తుంది.  ఒక వ్యక్తి బైక్ పై  కూర్చోగా ఇద్దరు పిల్లలు బైక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చున్నారు. అప్పటికే మరో ఇద్దరు పిల్లలు సహా ఇద్దరు మహిళలు ఎదురు చూస్తున్నారు. అనంతరం ఒక మహిళ బైక్ ఎక్కింది ఆమెకు ఒక చిన్నారిని అందించిన మరో మహిళ తన చంకలో మరో చిన్నారిని ఎత్తుకుని బైక్ ఎక్కింది.  ఇలా ఏడుగురు బైక్ పై ఎక్కగా  బైక్ ముందుకు వెళ్ళింది.  ఇది చూసిన వారు ఏదైనా ప్రమాదం జరిగితే ఏకంగా  కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: