ఒకసారి రోడ్డుపై వాహనం తో బయటకు వచ్చిన తర్వాత ప్రమాదం ఎటువైపు నుంచి దూసుకు వస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. ఎందుకంటే  మనం రోడ్డు నిబంధనలు పాటించనప్పటికి ఎదుట వచ్చేవారు రోడ్డు నిబంధనలు పాటిస్తారు అన్న నమ్మకం మాత్రం  ఉండదు.  ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు అనుకోని విధంగా ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.  ఎంతోమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా చివరికి ప్రాణాలు పోవటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.  అదేసమయంలో ఈ భూమ్మీద నూకలు తినే భాగ్యం ఉండాలి కానీ ఎలాంటి ప్రమాదం నుంచి అయినా బయట పడతారు అని చెబుతుంటారు పెద్దలు.


 ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇక పెద్దలు చెప్పిందే నిజం అని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి.  ఇక ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతు అందరిని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే కేవలం వాహనదారుల కారణంగానే కాదు కొన్ని కొన్ని సార్లు జంతువుల కారణంగా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్న  విషయం తెలిసిందే.  ఇప్పుడు మనం చూడబోతున్న వీడియో కూడా ఇలాంటిదే.


 అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ద్విచక్ర వాహనదారుడు ఒక జంతువు కారణంగా ప్రమాదం బారిన పడ్డాడు. కేవలం క్షణాల వ్యవధిలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.  సడన్ గా అతనికి ఒక పంది అడ్డం రావడంతో గమనించిన అతను బ్రేక్ వేసేలోపే  యాక్సిడెంట్ జరిగిపోయింది. ఈ క్రమంలోనే బైక్ పై  ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగిరి దారుణంగా రోడ్డు రోడ్డు మీద పడ్డాడు. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయాలపాలై  ఆస్పత్రి పాలయ్యాడు.  ఇక ఆ తర్వాత ఆ పంది  మాత్రం నిదానంగా లేచి అక్కడి నుంచి పరుగులు పెట్టింది. రాజోలు మండలం కడలి గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి రాగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: