ప్రాణ భయం అనేది ఈ భూమిమీద బ్రతికే ప్రతి జీవిలో కూడా ఒకే అలాగే ఉంటుంది అని చెప్పాలి. ఎదురుగా నిలబడి నప్పుడు పిరికివాడిలా ఉన్నవారు సైతం ఎంతో ధైర్యంగా ఎదుర్కో వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రాణం పోతుంది అనుకుంటే ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతు ఉంటారు అని చెప్పాలి. కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇతర జంతువులపై భీకర రీతిలో దాడి చేయడానికి కూడా సిద్ధమవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఎప్పుడూ వేటాడే సింహాలను సైతం కొన్ని కొన్ని సార్లు అడవిదున్నలు భయపెట్టడం లాంటివి జరుగుతూ ఉంటుంది.


 ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారిపోతూ జీవిత సత్యాన్ని అందరికీ చెప్పకనే చెబుతుంటాయి అని చెప్పాలి. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు కూడా జంతువులు ఎంతో చాకచక్యంగా  ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అప్పటికే బావిలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుక్కకు అక్కడే ఒక భారీ నాగుపాము కనిపించింది. ఆ నాగు పాము కుక్కను కాటు వేయడానికి దూసుకొచ్చింది. ఇలాంటి సమయంలో ఇక ప్రాణాలు కాపాడుకోవడానికి కుక్క నాగుపాముతో భీకరంగా పోరాడింది అని చెప్పాలి.



 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త యూట్యూబ్ వేదికగా వైరల్ గా మారి పోవడం తో ఇది చూసిన నెటిజన్లు ఎంతోమంది  షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ప్రమాదవశాత్తు ఒక లోతైన బావి లో పడింది కుక్క. అందులో నీళ్ళు లేకపోవడం గమనార్హం. బావిలో పడిన  చిన్న గాయాలతో బయటపడింది. ఇలాంటి సమయంలో హమ్మయ్య అని కుక్క పైకి లేచే లోపే వెనకాల ఒక పెద్ద నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. దీంతో కుక్క ఒక్కసారిగా జడుసుకుంది. కానీ ప్రాణాలను కాపాడడానికి చివరికి భీకరమైన యుద్ధం చేసింది. స్థానికులు ఈ కుక్కను ఎంతో చాకచక్యంగా కాపాడారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: