ఆడది అబల కాదు సబల అని చెబుతూ ఉంటారు. కానీ కేవలం కొంతమంది ఆడవాళ్లు మాత్రమే ఈ పదానికి న్యాయం చేస్తూ ఉంటారు. ప్రమాదం వచ్చినప్పుడు నేను ఆడపిల్లను.. నేనేం చేయగలను ఎవరైనా మగ తోడు ఉంటే బాగుండు అని ఎవరి కోసమో ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు నేటి సమాజంలో. కానీ కొంత మంది ఆడపిల్లలు మాత్రం వాళ్లు ఆడపిల్లలు కాదు ఆడ పులులు అన్న విధంగానే  ప్రమాదం వచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ప్రమాదం వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా ధైర్యంగా నిలబడి ఎదిరించి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.  శివంగిల మారిపోయి తమకు ప్రమాదం సృష్టించాలి అనుకున్న వారిని భయపెడుతూన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకో పోయేది కూడా ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించిన ఒక యువతి గురించి అని చెప్పాలి. సాధారణంగా  రాత్రి 11:30 గంటల సమయంలో ఓ యువతి ఒంటరిగా వెళ్తుండగా అబ్బాయి దారిలో కనిపిస్తేనె భయపడుతుంది.


 అలాంటిది ఒక అబ్బాయి ఆ యువతి పై దాడి చేసి బ్యాగ్ ఎత్తుకెళ్లేందుకు వస్తే తిరగబడేందుకు సాహసం చేయదు..  కానీ ఇక్కడ మాత్రం అలా చేయలేదు. ప్రమాదం వచ్చినప్పుడు సివంగిలా మారి దొంగని భయ పెట్టింది. ఢిల్లీ లోని బదర్పూర్ ప్రాంతం లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.  రాత్రి 11 గంటల సమయం లో నడుచుకుంటూ వెళుతుంది ఓ యువతి.  ఇంతలో  స్నాచర్స్ వచ్చి చేతి లో మొబైల్ ఫోన్ బ్యాగ్ లాక్కుని పోవాలి అనుకున్నాడు. కానీ ప్రతిఘటించిన సదరు యువతి అతని పై దాడి చేసింది. ఆమె ప్రతిఘటించిన తీరుకు దొంగ వెన్నులో వణుకు పుట్టింది. దీంతో అక్కడి నుంచి దొంగ పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: