కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు చాలా బలుపు ఉంటుంది. మనం చాలా సార్లు చూసి ఉంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ బ్యాంకుల్లో, పోలీస్ శాఖల్లో ఇంకా అలాగే ఆర్టీసీ శాఖల్లో కూడా ఇలాంటి తలపోగరు ఉద్యోగులు వుంటారు. మరి వాళ్ళు తమ గురించి ఏమనుకుంటారో.'ప్రయాణీకులే మా దేవుళ్లు, వారిని గమ్య స్థానాలకు చేర్చడమే మా పని' అనే స్లోగన్స్ ను మీరు ఆర్టీసీ బస్సుల్లో మనం ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాం.కొంతమంది ప్రయాణీకులకు మర్యాద ఇచ్చి వారితో గౌరవంగా నడుచుకుంటారు. ఒక్కోసారి కొన్ని సార్లు ప్రయాణీకులకు, బస్ కండక్టర్ మధ్య ఏదో ఒక విషయంలో ఘర్షణ జరుగుతుంటుంది. చిల్లర ఇవ్వలేదనే కారణంతో చాలా వరకు గొడవలు జరుగుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో బస్సు కండక్టర్ ఒక ప్రయాణీకుడితో చాలా దారుణంగా ఇంకా అనుచితంగా ప్రవర్తించడాన్ని చూడవచ్చు. అతనిని చెంపదెబ్బ కొట్టడమే కాకుండా బస్సులోంచి కిందికి దింపేస్తాడు. కాలితో తన్ని నీచంగా ప్రవర్తిస్తాడు. అంతటితో ఆగకుండా డోర్ మూసేసి బస్ డ్రైవర్‌ను వెళ్లమని చెప్తాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఇంకా బస్సు కండక్టర్ మధ్య గొడవ జరుగుతుంది. 


అతనిని బస్సు దిగిపోవాలని కండక్టర్ సూచించాడు. అయితే అతడు కిందకు దిగేందుకు ఒప్పుకోడు. దీంతో కండక్టర్ చాలా తీవ్ర ఆగ్రహానికి గురై అతని చెంపపై గట్టిగా కొడతాడు. అంతే కాకుండా బస్సు నుంచి కిందికి తన్ని పడేసి వెళ్లిపోతాడు. ఆపై బస్సు తలుపు మూసివేస్తాడు. తర్వాత ప్రయాణికుడిని అదే స్థితిలో వదిలేసి వెళ్లిపోతాడు.ఇక ఎవరో బాధ్యత గల పౌరుడు బయట నుంచి ఫోన్ తో వీడియో తీయడం వల్ల బాగా వైరల్ అయ్యి ఈ వైరల్ వీడియో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 14 వేలకు పైగా వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా ఆ సంఖ్య పెరుగుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కండక్టర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకుడి పట్ల అతను వ్యవహరించిన తీరు సరిగా లేదని, అతనిపై వెంటనే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: