సాధారణంగా వినాయక నిమజ్జన కార్యక్రమం అంటే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎంత నిష్టగా  పూజలు చేస్తారో.. ఇక వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని కన్నుల అంతకుమించి అనే రేంజ్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోని ప్రతి ఒక్కరు కూడా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారు అని చెప్పాలి. డీజే సప్ఫుల్లు బ్యాండ్ మోతలూ.. కోలాటాల కోలాహలం ఇలా వినాయక నిమజ్జనంలో అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన డాన్స్ చేస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.


 కాగా వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఎంతోమంది యువకులు నిమజ్జనం లో డాన్స్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే కొంతమంది చిత్రవిచిత్రమైన డాన్సులు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.  ఇక ఒక యువకుడు వినాయక నిమజ్జనం లో డాన్స్ చేసిన తీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు ఏంఅని చెప్పాలి. ఇన్నాళ్ళు ఇలా డాన్స్ చేయాలని తెలియక మేము వేరేలా చేశాము సారీ బ్రో అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తారు.

 ఇంతకీ ఏం జరిగిందంటే ఇక్కడ గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  ఆ సమయంలో ఓ యువకుడు నేలపై బోర్లా పడుకొని ఉంటాడు. ఇక పక్కనే డిజె శబ్దాలు వినిపిస్తున్న సమయంలో అతను పూనకంతో ఊగి పోయాడు అని చెప్పాలి. వచ్చి రాని డాన్స్ తో అరాచకం సృష్టించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. నేలపై దొర్లుతూ పక్కనే ఉన్న పొలంలో పడిపోయాడు.  అయినప్పటికీ అతను మాత్రం డాన్స్ ఆపలేదు. ఏమైనా దీక్ష పూనుకున్నాడో ఏమో పూనకం వచ్చినట్లు గానే పంట పొలంలో కూడా డాన్స్ చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత ఏం తాగోచ్చావ్ బ్రో మరి ఇంతలా డాన్స్ చేశావంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: