ఓ చిన్న బాలూడి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది నెటిజన్ల హృదయాలను బాగా గెలుచుకుంటుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ పిల్లవాడు తన తప్పుకు టీచర్‌ని క్షమాపణలు కోరుతున్నట్లు కనిపిస్తాడు.కానీ, అతను మేడమ్‌ని ఒప్పించడానికి ప్రయత్నించిన ఆ బాలుడు అమాయకత్వంతో ఓ అందమైన పనిచేశాడు.. దాంతో ఆ టీచర్‌ కోపం ఒక్కసారిగా పరారయిపోయింది.. ఇంతకీ ఆ బుడ్డొడు ఏం చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.వైరల్ అవుతున్న వీడియోలో ఓ పసివాడు తన తప్పుకు మామ్‌కి క్షమాపణలు చెబుతున్నట్లు మీరు చూడవచ్చు. అతను ఆ టీచర్‌తో పదే పదే చెబుతున్నాడు.ఇంకేప్పుడు నేను అలాంటి తప్పు చేయను. అయితే ఈ రోజు తన మాట వినకూడదని మేడమ్ కూడా నిర్ణయించుకున్నట్టే ఉన్నారు. ఇక నుండి నేను చేయను అంటునూ..మళ్ళీ మళ్లీ నువ్‌ ఇలాంటి పనులే చేస్తుంటావ్‌.. అంటూ టీచర్ కోపంగా ఉన్నారు. ఇక దాంతో తమ టీచర్‌ కోపాన్ని ఎలా పోగొట్టాలో బుడ్డొడికి అర్థం కాలేదు.వెంటనే..అతను మొదట ఆమెను ప్రేమతో కౌగిలించుకుని, ఆపై ఆమె చెంపపై ముద్దు పెట్టుకుంటాడు. నన్ను నమ్మండి టీచర్ అంటూ..పిల్లల మధ్య ఈ సంభాషణ చాలా అందంగా ఉంటుంది.


ఆ పిల్లవాడు చివరకు మేడమ్‌ను ఒప్పించడం, టీచర్‌ అతనిని క్షమించడం వీడియోలో చూడవచ్చు. కాబట్టి ఈ అందమైన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.బాలుడిపై టీచర్‌కి వచ్చిన కోపం తగ్గకపోవడంతో..ఆ బుడ్డొడు.. సడెన్‌గా ఆ టీచర్‌ బుగ్గపై ముద్దుపెట్టి ఒప్పించేందుకు ప్రయత్నించడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అయితే ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.అందమైన ఈ వీడియో @ChapraZila అనే హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో షేర్‌ చేయబడింది. 'మా చిన్నతనంలో అలాంటి టీచర్లు ఎందుకు లేరు' అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఒకరోజు క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ట్విట్టర్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 35 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇప్పుడు ఈ వీడియో చూడగానే చాలా మందికి ఇలాంటి స్కూల్ టీచర్లు ఉంటే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: