ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో రహదారులు ఎంత అధ్వానంగా మారిపోతున్నాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో గుంతల మయంగా మారిపోతున్న రోడ్లు అటు ప్రయాణికులు అందరికీ కూడా ప్రాణసంకటంగా మారిపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలా గుంతలమయంగా మారిపోయిన రోడ్ల కారణంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. కొన్నిసార్లు ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి.



 బిజెపి పాలిత ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్ లో కూడా రోడ్డు పై ఏర్పడిన గుంతలను కారణంగా ఆటో బోల్తా పడిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. అయితే రోడ్లు గుంతల మయంగా మారిపోయాయని ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు అంటూ ఒక వ్యక్తి లైవ్ లో ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే వెనకాల నుంచి వచ్చిన ఒక ఆటో బోల్తా పడింది. ఉత్తరప్రదేశ్లోని బలియా లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుడు  అయినా ప్రవీణ్ కుమార్ అక్కడి రోడ్ల దుస్థితి పై ఒక న్యూస్ ఛానల్ లో లైవ్ లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈక్రమంలోనే ఎలక్ట్రికల్  ఒకటి ఆ వ్యక్తి వెనుక నుండి వెళ్ళింది..



 భారీ గుంత మీదగా వెళ్ళిన ఆటో చివరికి ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది.  వెంటనే స్పందించిన స్థానికులు ఆటోని పైనకి లేపారు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ మరో వృద్ధుడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు అని చెప్పాలి. గుంతల మయంగా మారిపోయిన ఈ రోడ్ పై నిత్యం ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉంది అని చెబుతున్నారు. ఇలా లైవ్ లో రిపోర్ట్ చేస్తున్న సమయంలోనే ఆటో బోల్తా పడటం చూసిన  నెటిజన్లు అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: