సాధారణంగా పాములు పగ పడతాయ్ అని చెబుతూ ఉంటారు.. ఇక నేటి రోజులలో జనాలు మొత్తం ఇది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఇదే విషయంపై ఇప్పటివరకు ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.. సినిమాల ప్రభావం కారణంగా నిజంగానే పాములు పగపడతాయని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు. పాములు పగ బట్టడం లాంటివి చేయవు అని అటు ఎంతోమంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ నిజ జీవితంలో వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం నిజంగానే పాములు పగ పడతాయా ఏమో అని అనిపిస్తూ ఉంటుంది.


 ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటి కోవలోకే వస్తుంది అని చెప్పాలి. ఏకంగా పది రోజుల వ్యవధిలో ఒక పాము ఒక యువకుడిని ఐదుసార్లు కాటు వేసింది.  ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఇక ఐదు సార్లు కూడా ఒకే పాము ఒకేచోట కాటు వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. మన్ ఖేడ  గ్రామానికి చెందిన రామ్కుమార్ చాహర్ కుమారుడు రజత్ చాహర్ డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీన ఇంటి బయట వాకింగ్ చేస్తుండగా రజత్ ఎడమ కాలు పై పాము కాటు వేసింది. హాస్పిటల్ కు తీసుకువెళ్లగా నాలుగు గంటల పాటు అతడి పరిస్థితి పర్యవేక్షించి పాము కాటు లక్షణాలు కనిపించడం లేదని డాక్టర్లు తెలిపారు. రెండు రోజుల తర్వాత కాలకృత్యాలకు వెళ్లగా ఎడమకాలి పై మరోసారి అదే పాము కాటు వేసింది. ఇక వెంటనే నాటు వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు.


 ఈనెల 11వ తేదీన ఇంట్లో గదిలో ఉన్న సమయంలో మళ్ళీ ఎడమ కాలు పై మరోసారి కాటు వేసింది. కాగా మళ్లీ నాటు వైద్యుడి దగ్గరకు వెళ్లారు కుటుంబ సభ్యులు. ఈ నెల 13న బాత్రూం లో ఉన్న సమయంలో ఒకసారి.. 14వ తేదీన చెప్పులు వేసుకుంటూ ఉండగా..మరోసారి పాము అదే ఎడమ కాలు పై  కాటు వేయడం  గమనార్హం. అయితే అతను ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఏ క్షణంలో పాముకాటు కారణంగా తమ కొడుకు చనిపోతాడేమో అని కుటుంబ సభ్యులకు  భయం పట్టుకుంది. ఇక ఇలా రజత్ పై  పాము పగ బట్టిన విషయం మాత్రం స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: