చేసే పని ఏదైనా సరే ఆ పనిలో ఆనందం వెతుక్కుంటే.. ఇక ఎప్పుడూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు అని ఎంతో మంది మానసిక నిపుణులు చెబుతుంటారు. చేసే పనిలో ఆనందం లేకపోతే ఎన్ని డబ్బులు వచ్చిన వృధా అని అంటూ ఉంటారు. అయితే పని ఎలాంటిదైనా అందులో ఆనందం వెతుక్కోవాలి అన్నది మాత్రం కొంత మందిని చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. కొంత మంది తాము చేసే పనిని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ అసలు పనిచేయడానికి వచ్చినట్లు కాదు పార్టీ చేసుకోవడానికి వచ్చాము  అన్న విధంగా పనిలో లీనం అవుతూ ఉంటారు అని చెప్పాలి.


 ఇటీవలి కాలంలో ఎంతో మంది పోలీసులు సైతం ఇలాంటి తరహా ధోరణి తో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. సాధారణంగా పోలీసులు అంటే గంభీరంగా ఉంటారు అన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు. కానీ కొంతమంది ట్రాఫిక్ పోలీసులు మాత్రం తమలో దాగివున్న టాలెంట్ను నిరూపించుకోడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ఎంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకవైపు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేస్తూనే ఇక ఆ జాబ్ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కొంతమంది ట్రాఫిక్ కంట్రోల్ చేసే సమయంలో ఏకంగా డ్యాన్సులు చేస్తూ చేస్తూ ఉండటం లాంటి వీడియోలు వైరల్ గా మారిపోయాయ్.


 ఇక ఇప్పుడు ఒక పోలీసు మళ్లీ ఇలాంటిదే చేసి వార్తల్లో నిలిచాడు అని చెప్పాలి.  వాహనాలను మళ్ళీస్తున్న సమయంలో  ట్రాఫిక్ కానిస్టేబుల్ యూనిక్ స్టైల్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డెహ్రాడూన్ లో ఉన్న సిటీ హార్ట్ ఆస్పత్రి వద్ద హోంగార్డు జోగేంద్ర కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే  రోడ్డుపై వెళ్తున్న వాహనాలను వినూత్న రీతిలో నియంత్రిస్తున్నాడు.  హీరో లెవెల్ లో స్టైల్ గా నడుస్తూ అటు ఇటు తిరుగుతూ వాహనాలను నియంత్రిస్తూ ఉండటం గమనార్హం. ఇది చూసిన నెటిజన్లు రజినీకాంత్ స్టైల్ లో డ్యూటీ చేయాలనుకుంటున్నాడేమో అని కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: