ఇటీవలి కాలంలో మనుషులకు మెడికల్ షాపులకు ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. ఎందుకంటే అధునాతన జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతోమంది ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. క్రమం తప్పకుండా మెడికల్ షాప్ లకి వెళ్లడం మందులు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఏమాత్రం మందులు వేసుకోవడం మిస్సయిన చివరికి విపరీతమైన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు.. ఇక ఇలాంటి పరిస్థితుల మధ్య మెడికల్ షాపులకి మనుషులకు మధ్య ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. వ్యాధులతో బాధపడుతున్న వారు తరచూ మెడికల్ షాప్ కి వెళ్ళి వస్తూ ఉండటం చూస్తూ ఉంటాం.


 కానీ పశువులు మెడికల్ షాప్ కి వెళ్లి స్వయంగా మందులు తీసుకోవడం ఎప్పుడైనా చూసారా.. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో లంకి చర్మవ్యాధి గత కొన్ని రోజుల నుంచి పలు రాష్ట్రాల్లో ఉన్న పశువులను పట్టిపీడిస్తోంది. కొన్ని వేల సంఖ్యలో ఆవులు మృత్యువాత పడుతూ ఉండడం గమనార్హం. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఈ వ్యాధి ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఒక ఆవు కు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.  ఒక ఆవు ప్రతిరోజు మెడికల్ షాప్ ను విజిట్ చేస్తూ మందులు వేసుకుంటుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.


 ఇక మెడికల్ షాపు ముందుకు వచ్చిన ఆవుకు ప్రతిరోజు ఉచితంగా మందులు అందిస్తున్నాడు మెడికల్ షాపు యజమాని. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది. లంకి స్కిన్ డిసీస్ బారిన పడిన ఆవు క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం మెడికల్ వద్దకు వెళుతూ మందులు వేసుకుంటుంది. అయితే ఈ డిసీజ్ కారణంగా ఆవుకు భరించలేని మంట దురద కలుగుతుందని.. షాప్ కు దగ్గరలో ఉన్న ఒక ఆవు వ్యాధిబారిన పడి ఉందని గుర్తించి తగ్గించే మాత్రలను జాంగ్రీ లో పెట్టి దానికి అందిస్తున్నానని..  రోజు ఆ ఆవు మెడికల్ షాపు వద్దకు వస్తుంది అని చెబుతున్నాడు షాపు యజమాని.

మరింత సమాచారం తెలుసుకోండి: