ఇటీవలి కాలం లో దొంగల బెడద ఎంతలా పెరిగి పోతుంది ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. దొంగ తనాలు అంటే రాత్రి లో రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించడం.. ఈ క్రమం లోనే విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలను తెలుసు కొని అందినకాడికి దోచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్నది మాత్రమే తెలుసు. కానీ ఇటీవల కాలం లో మాత్రం కేవలం రాత్రిళ్లు మాత్రమే కాదు పట్ట పగలు కూడా దొంగతనానికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి  వస్తున్నాయ్. ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన దొంగలు బెడద  కాస్త ఎక్కువగానే ఉంది అని చెప్పాలి.


 కేవలం మనదేశంలోనే కాదండోయ్ ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా ఇలా దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బ్యాంకులను టార్గెట్గా చేసుకొని లూటి లకు పాల్పడుతూ ఉండడం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలోనే దొంగలను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారిపోతుంది అని చెప్పాలి. అయితే ముందుగా రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ ప్రకారమే దొంగలు చోరీ చేయాలనుకునే చోటుకు వెళుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ప్లాన్ రివర్స్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఇలాంటిదే జరిగింది.


 ఇటీవల కాలంలో పాశ్చాత్య దేశాలలో తుపాకులతో బెదిరించి దొంగతనాలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక దొంగ తుపాకీతో ఆఫీసులోకి చొరబడ్డాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనతో బ్యాంక్ బయటికి పరుగులు పెట్టాడు. ముందుగా కంప్యూటర్ దగ్గర పని చేస్తున్న అమ్మాయి దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న తుపాకీని టేబుల్ మీద పెట్టి బెదిరించాలి అనుకున్నాడు.  జేబులో ఉన్న తుపాకిని టేబుల్ మీద పెట్టే క్రమంలో అది జారీ అమ్మాయి వెనకాల పడింది. అమ్మాయి తుపాకీ చేతిలోకి తీసుకుంది. దీంతో కంగారుపడిన దొంగ ప్యాంట్ జారి పోతున్న పట్టించుకోకుండా బయటకు పరుగులు పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: