ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది అనే విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగా ఇక ఎంతోమంది అమాయకపూ ప్రజల ప్రాణాలను కూడా కొంతమంది వ్యక్తులు ప్రమాదంలో పెట్టేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక తాగి డ్రైవింగ్ చేయడం కారణంగా వారి ప్రాణాలను కూడా తీసేస్తున్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఇక ఎన్నో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్..


 ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందరూ చూస్తుండగానే క్షణాల వ్యవధిలో ఒక కారు వేగంగా దూసుకు వచ్చి బీభత్సం సృష్టించింది. ఇక ఇటీవల ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే రోడ్డు పక్కన ఆటోలు ఆగి ఉన్నాయి.   అక్కడ పాదచారులు అటూ ఇటూ నడుస్తూ బిజీబిజీగా ఉంది. ఇంతలో ఊహించని ఘటన. ఓ వైపు నుంచి కారు ఎంతో వేగంగా దూసుకు వచ్చింది. ముందుగా రోడ్డుపై ఆగివున్న ఆటోలను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత పాదచారులను ఢీ కొట్టింది.


 క్షణాల వ్యవధిలో ఇదంతా జరిగి పోయింది. అయితే అక్కడ చూస్తున్న వారికి ఏం జరుగుతుందో కూడా కాసేపటి వరకు అర్థం కాలేదు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోస్ సీసీ కెమెరాలో రికార్డైంది. ముంబైలోని ఘటకోపర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. హరీష్ దేశ్ముక్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. అయితే ప్రమాదవశాత్తు స్టార్ట్ అయిన క్యాబ్ అదుపుతప్పి ఏడుగురిని ఢీకొట్టింది. ఇక ఇందులో ఎంతో మంది పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు అన్న విషయం మాత్రం తెలుస్తుంది.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: