ప్రస్తుతం ప్రపంచం మొత్తం సెల్ఫీ మాయలు ఊగి పోతూ ఉంది అన్న విషయం తెలిసిందే . ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఇక ఆ మధురమైన క్షణాన్ని సెల్ ఫోన్ లో సెల్ఫీ రూపంలో బంధించాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రవిచిత్రమైన హావభావాలతో సెల్ఫీలు తీసుకుంటు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇటీవలి కాలంలో ఎంతోమంది లో సెల్ఫీ పిచ్చి బాగా పెరిగిపోయింది. కొన్ని కొన్ని సార్లు ఈ సెల్ఫీ పిచ్చి ప్రమాదాలకు కూడా కారణమవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 సెల్ఫీ పిచ్చి కారణంగా ఎంతోమంది చివరికి ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ వుంటారు. ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పటికీ కూడా చివరికి సరికొత్తగా సెల్ఫీ తీసుకోవాలి అనే ఉద్దేశంతో చివరికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా నేటి రోజుల్లో పెరిగిపోతుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక సెల్ఫీ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇలాంటి సెల్ఫీ తీసుకోవాలంటే నిజంగా దమ్ము ధైర్యం కావాలి భయ్యా అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. సాధారణంగా వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్ లు అడవిలో ఉండే క్రూరమృగాల దగ్గరికి వెళ్లి వీడియోలు ఫోటోలు తీయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కొంతమంది టూరిస్టులు ఇలాగే వెళ్లారు. ఎండకు తట్టుకోలేకపోయిన ఒక చిరుత పులి కారు రోఫ్ కిందకి వచ్చి అక్కడ సేదతీరుతుంది. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి చిరుత పులి కి  దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు అతని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: