సాధారణంగా కొన్ని కొన్ని సార్లు హెలికాప్టర్లు ప్రమాదాలకు గురికావడం లాంటి ఘటనలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు పైలెట్లు చేసిన తప్పిదాల కారణంగా హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటే.. మరి కొన్నిసార్లు సాంకేతిక లోపం కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా చివరికి హెలికాప్టర్ ప్రమాదాలు జరిగి ఎంతగానో ప్రాణ నష్టం జరగడం లాంటిది ఇప్పటివరకు ఎన్నోసార్లు చూసాం. ఇక్కడ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.



 హెలికాప్టర్ గాల్లోకి టేక్ ఆఫ్ అవుతూ ఉన్న సమయంలో హై టెన్షన్ కరెంటు వైర్లకు తగిలింది. దీంతో ఒక్కసారిగా హెలికాప్టర్లో మంటలు చెలరేగి హెలికాప్టర్ ఒకసారిగా నేలపై కుప్పకూలిపోయింది అని చెప్పాలి. అయితే అదృష్టవశాత్తు ఇందులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటం గమనార్హం. ఈ హెలికాప్టర్ ప్రమాదం బ్రెజిల్ లోని మీనాస్ గిరాయిస్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది. పార్లమెంటు సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో విద్యుత్ తీగలను తగిలి కింద పడిపోయింది.


 అయితే కింద పడిన హెలికాప్టర్లో మంటలు చెలరేకకముందే పైలెట్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు కూడా అప్రమత్తమయి వెంటనే బయటకు వచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పాలి. అయితే వెంటనే స్పందించిన రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్పందించిన వైద్యులు ప్రజా ప్రతినిధులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని టెన్షన్ పడాల్సిన పనిలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: