కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ప్రోత్సహించడానికి మంచి ప్రతిభను కనబరిచే వారికి వివిధ రకాల అదనపు ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి.ఆఫీస్ లో పని పై కొత్త మార్గాన్ని తీసుకువచ్చేలా కొత్త కొత్త టాస్క్ లను ఇస్తారు.ఇలా చేస్తున్న వారికి పోటీ పెట్టి బహుమతులు, రివార్డులను ప్రకటిస్తూ ఉంటారు..ఇలాంటి వాటిని తరచూ మనం చూస్తూనే ఉంటాము..అలా వారి కంపెనీ ఉత్పత్తులను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీ ఇలాంటి ఓ బంపర్ ఆఫర్ ను తమ ఉద్యోగులకు అందించింది.


ఆ ఛాలెంజ్‌ను బీట్ చేసిన వారికి బోనస్‌తో పాటు భారీ నజరానా కూడా ప్రకటించింది. Zerodha కంపెనీ తమ ఉద్యోగుల ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కంపెనీ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ విసిరింది. ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని పూర్తి చేసిన ఉద్యోగికి కంపెనీ 1 నెల జీతం బోనస్, రూ. 10 లక్షల రివార్డును అందజేస్తుందిన జెరోధా చీఫ్ ప్రకటించారు.


ఫిట్‌సెన్ లక్ష్యాన్ని సాధించడానికి కంపెనీ ఫిట్‌నెస్ ట్రాకర్‌లో రోజువారీ కార్యాచరణ లక్ష్యాలను సెట్ చేసుకోవాలని ఉద్యోగులకు సూచించింది సంవత్సరంలో 90 శాతం రోజులు కంపెనీ నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసిన ఉద్యోగికి ఒక నెల జీతం బోనస్, రూ. 10 లక్షల రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది..ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ హెడ్ నితిన్ కామత్ ట్వీట్ చేశారు.


ఫిట్‌నెస్ ట్రాకర్‌లో మీ రోజువారీ లక్ష్యాలను సెట్ చేసుకుని, పూర్తి చేయడం ద్వారా కంపెనీ ప్రకటించిన రివార్డ్‌లను పొందవచ్చు. అయితే, ఈ ఛాలెంజ్ ఐచ్ఛికం అని కామత్ స్పష్టం చేశారు. ఛాలెంజ్‌లో భాగంగా ఉద్యోగులు రోజుకు కనీసం 350 కేలరీలు బర్న్ చేయాలి. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నందున కంపెనీ ఈ ఛాలెంజ్ ఇచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంట్లో కూర్చోవడం వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులను యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ రకమైన ఫిట్‌నెస్ ఛాలెంజ్ ప్రారంభించిందని పేర్కొన్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: