సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలల్లో ఎక్కడో మారుమూలన జరిగిన విషయాలు కూడా సోషల్ మీడియాలో తెరమీదకి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇందులో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక మరికొన్ని వీడియోలు నెటిజన్లకు  అందరిని కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక జంతువుల మధ్య సంబంధాలను చూసి కొన్ని కొన్ని సార్లు ముచ్చటేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక అందమైన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది.


 సాధారణంగా వీధి కుక్కలు కోళ్లను వేటాడటం చేసి ఇక వాటి ఆహారంగా మార్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటాయి. కోళ్లు మాత్రమే కాదు ఇతర పక్షులను కూడా ఎక్కువగా వేటాడుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నోసార్లు ఎంతో మంది చూసే ఉంటారు. కళ్ళ ముందు కోడిలేదా వేరే పక్షి కనిపించింది అంటే చాలు తనని తాను చిరుత పులిలా ఊహించుకునే వీధి కుక్క చివరికి వెంటాడి వేటాడుతూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఇలా  కుక్క వేటాడడం గురించి మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ వీడియో చూస్తే మాత్రం మనసు పులకరించి పోతుంది అని చెప్పాలి. చిన్న కుక్కపిల్ల బాతు పిల్లలు ఒకే దగ్గర ఆడుతూ పాడుతూ కనిపించాయి.


 ఇక వీటి మధ్య స్నేహం చూసి అటు అభిమానులు అందరూ కూడా తెగ ఫీదా అయిపోతున్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. అయితే ముందుగా బాతు పిల్లలు కొన్ని అక్కడ ఆడుకుంటూ ఉండగా అక్కడికి చేరుకున్న కుక్కపిల్ల నేను ఇక్కడే ఉన్నాను.. ఏం భయపడకుండా.. ధైర్యంగా ఆడుకోండి అన్నట్లుగా బాతు పిల్లలకు ధీమా ఇస్తున్నట్లుగా కూర్చుంది. కానీ అంతలోనే నిద్రలోకి జారుకుంది ఆ కుక్కపిల్ల.  దీంతో ఇక బాతు పిల్లలు అన్నీ కూడా కుక్క పైనకి ఎక్కి హాయిగా ఆడుకుంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: