సాధారణం గా పెళ్లిళ్లు అంటే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు . ఇక పెళ్లికి వచ్చిన బంధువులందరికీ కూడా పంచభక్ష పరమాన్నాలు అందు బాటులో ఉంచుతారు పెళ్లివారు. ఈ క్రమం లోనే ఇక చాలు బాబోయ్ అనుకునేంతలా భోజనాలు పెడుతూ మర్యాదలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంత మంది చేసే అతిథి మర్యాదలు అయితే కాస్త ఇబ్బందికరం గా కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పెళ్లికి విచ్చేసిన అతిధులు పట్ల అవమానకరం గా ప్రవర్తించారు. విందుకు ముందు పెళ్లికి వచ్చిన అతిథులు అందరిని కూడా ముందుగా ఆధార్ కార్డు చూపించమని అడగడం గమనార్హం.


 దీంతో పెళ్లి ఇంటి వారి తీరుతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బంధువులు. ఇక కొంతమంది భోజనం తినకుండానే ఇంటికి వెళ్లిపోయారు అని చెప్పాలి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. అమ్రోహ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హసన్ పూర్ లోని ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ లో ఇటీవల ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఒకే వేదికపై పెళ్లి జరిగింది. అయితే వివాహానికి ఎక్కువ మంది అతిథులు హాజరయ్యారు. దీంతో పెళ్లి ఇంటి కుటుంబం ఆందోళన చెందింది.


 పిలిచిన వారితో పాటు బయట వారు కూడా ఎక్కువగా రావడంతో పెళ్లికి వచ్చిన వారిని ఆధార కార్డు చూపించమని అడిగారు. ఆధార్ కార్డు చూపించిన వారిని మాత్రమే విందు ఏర్పాటుచేసిన హాల్లోకి పంపించారు. దీనిపై కొంతమంది అతిథుల ఆగ్రహం వ్యక్తం చేసి భోజనం చేయకుండానే వెనుతిరిగారు. కొంతమంది దీనిని మొబైల్ లో రికార్డ్ చేయడంతో ఈ వీడియో కాస్త ట్విట్టర్లో తెగ చెక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజెన్లు ఎంతో ప్రేమగా పెళ్లికి ఆహ్వానించి చివరికి విందు విషయంలో ఇలా అవమానించి పంపించడం ఏంటో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: