ఇటీవల కాలంలో మనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ పెడితే చాలు ఇంటి ముంగిటికీ కావాల్సిన వస్తువులు తెచ్చి పెడుతున్నారు. ఇందుకోసం ఎన్నో ఆన్లైన్ సంస్థలు అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల  కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆన్లైన్ సంస్థలపై అతిగా ఆధారపడిపోతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఇలా ఆన్లైన్లో ఆర్డర్ల విషయంలో ఎన్నో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.


 ఇక ఇలాంటి ఘటనల ద్వారా చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న ఎంతో మంది కస్టమర్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇక బీహార్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఆన్లైన్ వెబ్సైట్లు ఎన్నో ఆఫర్లను పెట్టి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. కస్టమర్లు భారీ తగ్గింపు నేపద్యంలో  ఎక్కువగా ఆర్డర్లు కూడా చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల నలందలోని పర్వాల్ పూర్ కు చెందిన చైతన్యకుమార్ అనే వ్యక్తి ఈ కామర్స్ సంస్థ మీ షో వేదికగా లక్ష రూపాయల విలువైన డ్రోన్ కెమెరా ఆర్డర్ ఇచ్చాడు.


 ఇక ఇందుకు సంబంధించి ఆన్లైన్లోనే డబ్బులు కూడా చెల్లించాడు. ఇక అందులో చెప్పిన సమయం ప్రకారమే పార్సల్ పట్టుకుని మీ షో డెలివరీ ఎగ్జిక్యూటివ్ చైతన్యకుమార్ కుమార్ ఇంటికి వచ్చాడు.  అనుమానం వచ్చిన చైతన్యకుమార్ ఇక ఆ పార్సెల్ బాక్స్ ను ఎగ్జిక్యూటివ్ చేతనే అన్బాక్స్ చేయించాడు. ఇక ఆ పార్సెల్ ఓపెన్ చేయగా అందులో బంగాళాదుంపలు కనిపించాయి. దీంతో చైతన్యకుమార్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే దీంతో తనకు సంబంధం లేదని డెలివరీ బాయ్ చెప్పడం గమనార్హం. కాగా ఇదే విషయంపై పర్వాల్ పూర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు చైతన్యకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: