అడవిలో అతి భయంకరమైన అతి శక్తివంతమైన జంతువు ఏది అంటే ప్రతి ఒక్కరు చెప్పేస్తారు సింహం అని . అందుకే సింహాన్ని అటు అడవికి రారాజు అని చెబుతూ ఉంటారు.  ఇక సింహం జోలికి రావడానికి ఏ జంతువు అయినా సరే భయ పడిపోతూ ఉంటుంది అని చెప్పాలి. తమకంటే ఎంతో పెద్ద ఆకారాన్ని కలిగిన జంతువులను సైతం ఎంతో అలవోకగా  వేటాడుతూ తమకు ఆహారంగా మార్చు కుంటూ ఉంటాయి సింహాలు. ఈ క్రమంలోనే సింహాల వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటివరకు వైరల్ గా మారి పోయాయి అని చెప్పాలి.


 ఇలా సింహం వేటకు సంబంధించిన వీడియో లను చూసినప్పుడు ప్రతి ఒక్కరి వెన్ను లో వణుకు పుట్టడం ఖాయం అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. కాగా ఇప్పటివరకు సింహం ఎన్నో రకాల జంతువులను వేటాడటం లాంటి వీడియోలు వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఒక డూప్లికేట్ జిరాఫీని సింహాలు వేటాడిన వీడియో ట్విట్టర్ వేదికగా తెగ చెక్కలు కొడుతుంది అని చెప్పాలి.  హనుమాన్ జంక్షన్ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అందులో హీరో వేణు సహా మరో కమెడియన్ ఎద్దు ఆకారంలో హీరోయిన్ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.


 ఇక్కడ ఇద్దరు వ్యక్తులు జీబ్రా లాగా సెట్ అప్ చేసుకుని ఇక అడవిలోకి వెళ్లి జీబ్రా  వెంట పడుతూ కాస్త సరదాగా తిరుగుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే సింహాలు వీరిని గమనిస్థాయి. నిజంగానే జీబ్రా  అనుకుంటాయ్. దీంతో వేటాడడానికి వస్తాయి. దీంతో వారికి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలీ. చివరికి ఎంతో చాకచక్యంగా ఆ సింహాల నుంచి తప్పించుకున్నారు ఇద్దరు వ్యక్తులు. అయితే ఏమాత్రం పొరపాటు జరిగిన కూడా సింహాలకు చివరికి ఆ ఇద్దరు వ్యక్తులు ఆహారంగా మారిపోయేవారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: